Breaking News

సీఎఫ్‌వో జతిన్ దలాల్‌: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్‌లో ప్రత్యక్షం!

Published on Thu, 09/28/2023 - 21:34

విప్రో (Wipro) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్‌ (Jatin Dalal)ను తమ సీఎఫ్‌వోగా నియమించుకుంది ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant). ఆయన ఇటీవలే విప్రో సంస్థలో సీఎఫ్‌వోగా రాజీనామా చేశారు.

(లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ)

ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్‌ కాగ్నిజెంట్‌ సీఈవోగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ కంపెనీలో జతిన్‌ దలాల్ రెండవ హై ప్రొఫైల్ నియామకం. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎఫ్‌వో జాన్ సీగ్మండ్ నుంచి జతిన్‌ దలాల్ బాధ్యతలు స్వీకరిస్తారని కాగ్నిజెంట్‌  ఒక ప్రకటనలో తెలిపింది.

కంపెనీలు మారుతున్న టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు
ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ గత మార్చిలో వైదొలిగారు. ఆయన స్థానంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లలో పనిచేసిన మోహిత్ జోషిని సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది టీసీఎస్‌. వచ్చే డిసెంబర్‌లో ఆయన విధుల్లో చేరన్నారు.

(ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట)

ఇక జతిన్‌ దలాల్ విప్రోలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ట్రెజరీ కార్యకలాపాలలో మేనేజర్‌గా చేరిన ఆయన ప్రెసిడెంట్, సీఎఫ్‌వో వరకూ ఎదిగారు. ఆయన నిష్క్రమించిన మరుసటి రోజే విప్రో షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి.

2015లో విప్రో సీఎఫ్‌వో అయిన జతిన్‌ దలాల్.. కంపెనీ సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి కోవిడ్‌ సమయంలో కంపెనీని విజయవంతంగా నడిపించారు. డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ పెరగడంతో 2020, 2021 సంవత్సరాల్లో కంపెనీ షేర్లు వరుసగా 57 శాతం, 85 శాతం పెరిగాయి. అదే కాలంలో భారత నిఫ్టీ IT ఇండెక్స్‌లో 55 శాతం, 60 శాతం వృద్ధిని సాధించింది.

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు