ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్‌ మృతి.. సైకిల్‌పై వెళ్తుండగా ఏమైందంటే..

Published on Thu, 02/29/2024 - 13:16

ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68) మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లో కన్నుముశారు. ఆయన సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం..బుధవారం తెల్లవారుజామున 5:50 గంటలకు సైనీ తన సహచరులతో కలిసి నెరుల్ ప్రాంతంలోని పామ్ బీచ్ రోడ్డులో సైకిల్‌పై వెళుతున్నారు. వేగంగా వస్తున్న క్యాబ్ సైనీ సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత క్యాబ్‌ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే కిందపడిన సైకిల్ ఫ్రేం క్యాబ్ ముందు చక్రాల కింద ఇరుక్కుపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఘటనలో సైనీకి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి సైక్లిస్టులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు చెప్పారు. 

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో ఆవులు.. ఊరించిన ఆఫర్‌.. తీరా చూస్తే..

సైనీ ఇంటెల్ 386, 486 మైక్రోప్రాసెసర్‌ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కంపెనీ పెంటియమ్ ప్రాసెసర్ రూపకల్పనకు ఆయన నాయకత్వం వహించారు. ఇంటెల్‌ దక్షిణాసియా విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన సతీమణి మూడేళ్ల క్రితమే చనిపోయారు. కుమార్తె, కుమారుడు అమెరికాలో నివాసముంటున్నారు. సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)