Breaking News

రికార్డు స్ధాయి దిశగా ఫారెక్స్‌ నిల్వలు

Published on Sat, 01/20/2024 - 05:32

ముంబై: భారత్‌ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వల పరిమాణం రికార్డుల స్థాయిగా కదులుతోంది. జనవరి 12వ తేదీతో ముగిసిన వారంలో నిల్వలు 1.63 బిలియన్‌ డాలర్లు పెరిగి 618.9 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్‌ నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 645 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. రూపాయి పటిష్టతను కాపాడడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 100 బిలియన్‌ డాలర్లకుపైగా తగ్గినప్పటికీ  తిరిగి కొంత ఒడిదుడుకులతో ఎగువదిశగా ఫారెక్స్‌ నిల్వలు ఎగశాయి. ప్రస్తుత దేశ ఫారెక్స్‌ నిల్వలు 13 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా.

► మొత్తం నిల్వల్లో ప్రధాన భాగంగా ఉన్న డాలర్ల రూపంలోని ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ 1.859 బిలియన్‌ డాలర్లు ఎగసి 548.508 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి.
► పసిడి నిల్వల విలువ 242 మిలియన్‌ డాలర్ల పెరిగి 47.247 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.
► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)– స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) విలువ 12 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.31 బిలియన్‌ డాలర్లకు చేరింది.  
► ఐఎంఎఫ్‌ వద్ద భారత్‌ నిల్వల 6 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.872 బిలియన్‌ డాలర్లకు
ఎగసింది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)