Breaking News

భారత్‌పై ఆశావహంగా విదేశీ ఇన్వెస్టర్లు

Published on Fri, 06/16/2023 - 04:42

ముంబై: భారత్‌పై అమెరికా, యూరప్‌లోని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆశావహంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఈక్విటీల్లోకి 9.5 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు తిరిగి రావడమే ఇందుకు నిదర్శనమని స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో తెలిపింది. అంతక్రితం మూడు నెలల్లో 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయని వివరించింది.

చాలా మంది గ్లోబల్‌ ఇన్వెస్టర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి గెలుస్తారని విశ్వసిస్తున్నారని, డిసెంబర్‌ త్రైమాసికంలో పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. 50 పైగా అమెరికన్, యూరోపియన్‌ ఎఫ్‌పీఐలతో సమావేశాల అనంతరం యూబీఎస్‌ ఈ నివేదికను రూపొందించింది. ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు పెట్టుబడులు మెరుగ్గా ఉండటం .. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణికి కారణమని పేర్కొంది. అయితే, బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ప్రజలు తమ సొమ్మును ఈక్విటీల్లో కాకుండా ఇతరత్రా సాధనాల్లో దాచుకోవడం, వృద్ధి బలహీనపడటం తదితర రిస్కులు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిఫ్టీ 18,000 స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్‌ వివరించింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)