Breaking News

ఫార్మాలో విదేశీ పెట్టుబడుల వెల్లువ

Published on Sun, 12/15/2024 - 05:25

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్‌ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయి. 2024–25 మొదటి అర్ధభాగంలో ఎఫ్‌డీఐలు నాలుగురెట్లకుపైగా దూసుకెళ్లి 520 మిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో ఎఫ్‌డీఐ ఈక్విటీ 117 మిలియన్‌ డాలర్లు మాత్రమే. 2000 ఏప్రిల్‌ నుండి 2024 సెప్టెంబర్‌ వరకు డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్‌ రంగంలోకి వచ్చిన విదేశీ నిధులు 23.05 బిలియన్‌ డాలర్లు. 

ఇది ఈ కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 3.25 శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2024 సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో విదేశీ నిధులు దాదాపు పది రెట్లు వృద్ధిని నమోదు చేశాయి. 2024 జూలై నుండి సెప్టెంబర్‌ వరకు 284 మిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయి. 2023 సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది కేవలం 27 మిలియన్‌ డాలర్లు మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 162 శాతం వృద్ధితో ఎఫ్‌డీఐలు 236 మిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 90 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 

డీవోపీకి ఆ బాధ్యతలు..
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మాస్యూటికల్‌ రంగంలోకి 1.06 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇది 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.06 బిలియన్‌ డాలర్లు. 2021–22లో 1.41 బిలియన్‌ డాలర్లు నమోదైంది. ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో నూతనంగా స్థాపించే ప్రాజెక్టులకు విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్‌ రూట్‌లో 100 శాతం వరకు అనుమతిస్తారు. ఇప్పటికే ఉన్న  ఫార్మాస్యూటికల్‌ ప్రాజెక్ట్‌లకు 74 శాతం దాటే విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 2017 మే నెలలో ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ను (ఎఫ్‌ఐపీబీ) రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ ఆమోదం మార్గంలో విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌కు (డీవోపీ) ఆ బాధ్యతలను అప్పగించారు. అలాగే వైద్య పరికరాల రంగానికి సంబంధించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సైతం ఈ డిపార్ట్‌మెంట్‌ పరిశీలిస్తుంది.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)