Breaking News

పండగ సీజన్‌పై ఫోకస్‌.. లక్ష ఉద్యోగాలకు అవకాశం

Published on Thu, 09/05/2024 - 07:20

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ పండుగ సీజన్‌పై మరింతగా కసరత్తు చేస్తోంది. రాబోయే బిగ్‌ బిలియన్‌ డేస్‌ (టీబీబీడీ) 2024 సేల్‌ కోసం పెద్ద ఎత్తున నియామకాలు జరపనుంది. కొత్తగా 1 లక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్‌ అసోసియేట్లు, లాజిస్టిక్స్‌ కోఆర్డినేటర్లు, కిరాణా పార్ట్‌నర్లు, డెలివరీ డ్రైవర్లు మొదలైన సిబ్బందిని తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.

పండుగ సీజన్‌ కోసం కొత్త వర్కర్లకు అవసరమైన శిక్షణనివ్వనున్నట్లు వివరించింది. ఇప్పటికే తొమ్మిది నగరాల్లో 11 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను (ఎఫ్‌సీ) ప్రారంభించినట్లు, దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 83కి చేరినట్లు ఫ్లిప్‌కార్ట్‌ వివరించింది. సామాజిక–ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్న లక్ష్యంతో ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.

ఈ ఏడాది పండుగ సీజన్‌ సందర్భంగా ఒకవైపు తమ నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటు మరోవైపు ఆర్థిక వృద్ధికి దోహదపడాలని, స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వివరించింది. తమ సరఫరా వ్యవస్థ కార్యకలాపాలు నిరాటంకంగా సాగేలా, పెరుగుతున్న డిమాండ్‌ ప్రకారం నిల్వల నిర్వహణ, ప్రోడక్టుల లభ్యత మొదలైన అంశాలను మెరుగుపర్చుకునేందుకు వినూత్నమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. పండుగల సీజన్‌లో ఈ–కామర్స్‌ కంపెనీలు కల్పించే ఉద్యోగాలు సాధారణంగా ఆయా సీజన్‌లకు పరిమితమైనవిగా ఉంటాయి.  

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)