Breaking News

ఫ్లిప్‌కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్‌

Published on Wed, 08/13/2025 - 16:48

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘క్రాఫ్టెడ్‌ బై భారత్‌’ (Crafted by Bharat) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సేల్‌ 10వ ఎడిషన్‌ది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశీయ కళాకారులు, చేనేతలు, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌ నిర్వహిస్తోంది.

ఈ ఒ​​​క్కరోజు ప్రత్యేక సేల్‌లో 1.4 లక్షలకు పైగా హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తారు. 2,200 మందికి పైగా కళాకారులు, స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. వార్లీ, పటచిత్ర, మధుబని, పిచ్వాయి, టెర్రకోటా,  ప్రాంతీయ చెక్క కళాకృతులు, హోమ్ డెకోర్, ఫర్నిచర్, వంటగది వస్తువులు, దుస్తులు మొదలైనవి ఈ ప్రత్యేక సేల్‌లో అందుబాటులో ఉంటాయి. భదోహి, హత్రాస్, మధురై, కన్నౌజ్, రామనగర, ఉజ్జయిని వంటి చిన్న పట్టణాల మహిళలు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు ఈ సేల్‌ అవకాశం కల్పిస్తోంది.

ఏటా నిర్వహించే ఈ సేల్‌లో ఈసారి 100 మంది​​కిపైగా కొత్త విక్రేతలు చేరారు. ఎంఎస్‌ఎంఈలు, స్థానిక కళాకారుల​కు సాధికారత కల్పిస్తూ తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్‌ వేదికగా విక్రయించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సమర్థ్‌ మిషన్‌ సహకారం అందిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)