Breaking News

రియల్ ఎస్టేట్‌ కొత్త పుంతలు - వాటివైపే కొనుగోలుదారుల చూపు!

Published on Sun, 01/28/2024 - 16:40

రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్లాట్ల్స్ లేదా అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే గత కొంత కాలంగా పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారతదేశంలో ఏడు ప్రధాన నగరాల్లో సగటు అపార్ట్‌మెంట్ సైజులు గత ఏడాది 11 శాతం పెరిగాయి.

పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2022లో 1175 చదరపు అడుగులు ఉన్న అపార్ట్‌మెంట్ల పరిమాణం 2023 నాటికి 1300 చదరపు అడుగులకు చేరిందని అనరాక్ రీసెర్చ్ ఒక నివేదికలో వెల్లడించింది.

2020, 2021 కంటే కూడా 2023లో ఢిల్లీ NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఫ్లాట్స్ పరిమాణం పెరిగినట్లు తెలిసింది.

👉ఢిల్లీ NCRలో ఫ్లాట్ పరిమాణం అత్యధిక వృద్ధిని సాధించింది. అంటే 2022లో 1375 చదరపు అడుగులు ఉన్న ప్లాట్ 2023 నాటికి 1890 చదరపు అడుగులకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నగరంలో పరిమాణం 37 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలుదారుల డిమాండ్ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ల వైపు తిరగడం వల్ల డెవలపర్‌లు పెద్ద అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు.

👉హైదరాబాద్‌లో 2022లో 1775 చదరపు అడుగులున్న ప్లాట్ 2023 నాటికి 2300 చదరపు అడుగులకు చేరింది. అంటే హైదరాబాద్‌లో ప్లేట్ సైజు 30 శాతం పెరిగింది.

👉బెంగళూరులో, సగటు ఫ్లాట్ పరిమాణం 2023వ సంవత్సరంలో 26% పెరిగింది. 2022లో 1,175 చదరపు అడుగుల నుంచి 2023లో 1,484 చదరపు అడుగులకు పెరిగింది.

👉పూణేలో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 980 చదరపు అడుగుల నుంచి 2023లో 11% పెరిగి 1,086 చదరపు అడుగులకు చేరుకున్నాయి.

👉చెన్నైలో ప్లాట్ పరిమాణం 2022 కంటే 5 శాతం పెరిగింది. 2022లో 1200 చదరపు అడుగులున్ ఫ్లాట్ సైజు 2023 నాటికి 1260 చదరపు అడుగులకు చేరింది.

ఇదీ చదవండి: ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)