హైదరాబాద్‌లో ఫ్లాట్‌ కొంటున్నారా..? ధరలు.. ఏ ఏరియాలో ఎంత?

Published on Sat, 11/30/2024 - 14:35

సాక్షి, సిటీబ్యూరో: స్టీల్, సిమెంట్‌ తదితర నిర్మాణ సామగ్రి రేట్లు పెరుగుతుండటంతో అపార్ట్‌మెంట్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ వంటి సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది.

కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్‌ ప్రాజెక్ట్‌లతో ఫ్లాట్ల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. కరోనా తర్వాత విశాలమైన అపార్ట్‌మెంట్లు, హైరైజ్‌ ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్‌ ప్రాజెక్ట్‌లలో స్విమ్మింగ్‌ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్‌ ట్రాక్స్‌ వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నారు.

కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చ.అ.కు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగానే ధరలు ఉంటున్నాయి. నగరంలో అపార్ట్‌మెంట్‌ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,500 ఖర్చవుతోంది. భవనం ఎత్తును బట్టి నిర్మాణ వ్యయం పెరుగుతూంటుంది.

నోట్‌: అపార్ట్‌మెంట్‌ విస్తీర్ణం, వసతులు, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)