CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం
Breaking News
వింగ్స్ ఇండియా 2026లో విమానాల కొనుగోలు ఒప్పందం
Published on Fri, 01/30/2026 - 08:18
రష్యాకి చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ)తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఏరోస్పేస్ సంస్థ ఫ్లెమింగో ఏరోస్పేస్ ఫౌండర్ శుభకర్ పప్పుల తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో ఆరు ఐఎల్–114–300 రకం విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వీటి విలువ 180–200 మిలియన్ డాలర్లుగా ఉంటుందని చెప్పారు.
ఈ విమానాలను పూర్తిగా దేశీయంగానే తయారు చేసేలా, సాంకేతికంగా కూడా తోడ్పడేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక్కడే విమానాల అసెంబ్లీ, కస్టమైజేషన్, మెయింటెనెన్స్ మొదైలనవి చేపట్టవచ్చని పేర్కొన్నారు. 2032 నాటికి వీటిని పూర్తి స్థాయిలో దేశీయంగా రూపొందించగలమన్నారు. ప్రాంతీయంగా స్వల్ప, మధ్య స్థాయి దూరాలకు ఈ 68 సీటర్ల విమానాలు అనువుగా ఉంటాయని శుభకర్ వివరించారు.
ఇండో–పసిఫిక్ ఏవియేషన్‌కి అవార్డు
జెట్‌సెట్‌గో అనుబంధ సంస్థ ఇండోపసిఫిక్ ఏవియేషన్‌కి ‘బెస్ట్ ఎన్‌ఎస్‌వోపీ–ఫిక్సిడ్ వింగ్స్’ పురస్కారం దక్కింది. నాన్–షెడ్యూల్డ్ ఏవియేషన్ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరుకు గాను సంస్థ ఈ అవార్డును దక్కించుకుంది. వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం సందర్భంగా జెట్‌సెట్‌గో ఫౌండర్ కనికా టేక్రివాల్కి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పురస్కారాన్ని అందజేశారు. రెండోసారి ఈ అవార్డును దక్కించుకోవడమనేది కచ్చితత్వానికి, భద్రతకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందని కనిక తెలిపారు.
ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే
Tags : 1