Breaking News

హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా..?

Published on Sun, 02/02/2025 - 15:17

సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవిత కల. పైసా పైసా కూడబెట్టి, గృహ రుణంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. గృహ కొనుగోలు (Buying House)నిర్ణయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, నిర్లక్ష్యం వహించినా కష్టార్జితమంతా వృథా అవుతుంది. మరీ ముఖ్యంగా తొలిసారి గృహ కొనుగోలుదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీని (Property) కొనుగోలు చేయడం అంటే కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు.. జీవనశైలి ఎంపిక. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అందబాటు ధరలు, అభివృద్ధి అవకాశాలు, దీర్ఘకాలిక పెట్టుబడికి సరైనది హైదరాబాద్‌. నగరంలో గృహ కొనుగోలుదారులు ఈ పంచ సూత్రాలు పాటిస్తే సొంతింటిని దక్కించుకోవచ్చు.     – సాక్షి, సిటీబ్యూరో

  • బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట ప్రాంతాలు విలాసవంతమైన జీవనం, పెట్టుబడుల వృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నాయి. వృద్ధి సమతుల్యత, అందుబాటు ధరల కోసమైతే నార్సింగి, కొల్లూరు, రాజేంద్రనగర్, తెల్లాపూర్‌ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాలు ఆధునిక మౌలిక సదుపాయాలు, ఐటీ కారిడార్లకు సమీపంలో ఉండటంతో నివాసం 
    ఉండేందుకు, పెట్టుబడులకు రెండింటికీ అనువైన ప్రాంతాలు.

  • లగ్జరీ ప్రాపర్టీల కొనుగోలుదారులు ఇంటి ధరను మాత్రమే కాదు రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ప్రీమియం వసతులు, హైఎండ్‌ ఇంటీరియర్‌ కూడా పరిగణలోకి తీసుకోవాలి. విలాసవంతమైన జీవితాన్ని విలువైనదిగా చేసే నిర్వహణ చార్జీలు కూడా ఉంటాయని గమనించాలి.

  • విలాసవంతమైన ఇల్లు, దాని నిర్మాణ శైలి గురించి తెలుసుకోవాలి. లగ్జరీ ప్రాపర్టీల అనుభూతిని పొందాలంటే డెవలపర్‌ కీలకపాత్ర పోషిస్తారు. వారి ఉన్నత నైపుణ్యం, సకాలంలో డెలివరీ, వినూత్నమైన డిజైన్లు, ఎలివేషన్లకు ప్రసిద్ధి చెందిన బిల్డర్‌ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం ఉత్తమం. నిర్మాణంలో నాణ్యత, ప్రత్యేకతలు అందించే రెరా ఆమోదిత ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.

  • ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో స్టేషన్లు, రాబోయే మౌలిక సదుపాయాల ప్రాంతాలలో స్థలాలు, గృహాలను కొనుగోలు చేస్తే తక్కువ కాలంలో విలువ రెట్టింపు అవుతుంది. ప్రైవసీ, ప్రశాంతతను కోరుకునే వారికీ ఈ ప్రాంతాలే బెటర్‌. రవాణా సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలైతే రాకపోకలు సౌలభ్యంగా ఉంటుంది.

  • ఎంపిక చేసిన ప్రాపర్టీకి సంబంధించి న్యాయ నిపుణులు, ప్రొఫెషనల్స్‌ సలహాలు తీసుకోవాలి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు గురించి ఆరా తీయాలి.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?