Breaking News

త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..

Published on Mon, 01/08/2024 - 19:47

పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘ఫస్ట్‌క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు.

కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్‌క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్‌హోల్డర్‌గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది.

6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్‌లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్‌క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు.

ఫస్ట్‌క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్‌వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్‌క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్‌ మహీంద్ర, సాఫ్ట్‌ బ్యాంక్‌ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)