Breaking News

అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్‌ ప్రాసెస్‌ ఎలా?

Published on Fri, 10/24/2025 - 12:16

అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదబారిన పడడంతో మంటలు చెలరేగి కొందరు ప్యాసింజర్లు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ప్రమాదంలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బీమా చేయించిన ఇతర విలువైన వస్తువుల నష్టాన్ని ఇన్సూరెన్స్‌ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్‌ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.

ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలా

బీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే బీమా ప్రొవైడర్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.

నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. బీమా కంపెనీ స్పందించడానికి ముందే రిపేర్ చేయడం వంటి చేయకూడదు.

క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్‌లైన్‌లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు, వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్‌లు, అధికారిక నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.

కంపెనీకి సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక వ్యక్తిని నియమించే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి సహకరించండి. తనకు అవసరమైన సమాచారం, పత్రాలను అందించాలి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలి.

క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.

Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీని అనుసరించి విధానాలు మారవచ్చు. కాబట్టి మీ పాలసీ డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

ఇదీ చదవండి: ఇండిపెండెంట్‌ ఇల్లు Vs అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)