Breaking News

పండుగ కానుక: భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌!

Published on Sat, 10/01/2022 - 11:27

దేశంలో నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పండుగ కానుకగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్టోబర్‌ 1న, కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25.50 తగ్గింది.

బిగ్‌ రిలీఫ్‌.. భారీ తగ్గింపు!
అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలతో సహజవాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రాజధానిలో కమర్షియల్‌ ఎల్‌పీజీ (LPG Cylinder) సిలిండర్ల ధరను ₹ 25.50 తగ్గించాయి. ఈ తాజా ధరల సవరణతో, ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,859.50గా ఉండగా అంతకు ముందు రూ. 1,885 ఉంది.

కోల్‌కతాలో, దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ. 1811.50గా ఉంది. కమర్షియల్‌ సిలిండర్‌ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర ₹ 91.50 తగ్గింది, ఢిల్లీలో ధర ₹ 1,885 నుంచి ₹ 1,976కి తగ్గిన సంగతి తెలిసిందే.

చదవండి: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. కొత్త సేవలు రాబోతున్నాయ్‌!

Videos

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)