పెరిగిన ఎరువుల దిగుమతి

Published on Tue, 02/28/2023 - 01:56

న్యూఢిల్లీ: భారత్‌ ఎరువుల దిగుమతి పరిమాణం జనవరిలో  3.9 శాతం పెరిగి 19.04 లక్షల టన్నులకు చేరింది. 2022 జనవరిలో ఈ పరిమాణం 18.33 లక్షల టన్నులు.  ఎరువుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం..

► 2023 జనవరి మొత్తం 19.04 లక్షల టన్నుల దిగుమతుల్లో యూరియా 10.65 లక్షల టన్నులు. డీ అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) 5.62 లక్షల టన్నులు. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపీ) 1.14 లక్షల టన్నులు.  కాంప్లెక్స్‌లు 1.63 లక్షల టన్నులు. 2022 జనవరిలో యూరియా దిగుమతుల పరిమాణం 12.48 లక్షల టన్నులు.   డీఏపీ 2.45 లక్షల టన్నులు. ఎంఓపీ 3.40 లక్షల టన్నులు. ఎంఓపీ పరిమాణం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు రెండింటి వినియోగానికి ఉద్దేశించినది.  
► ఈ ఏడాది జనవరిలో దేశీయ ఎరువుల ఉత్పత్తి 2022 ఇదే నెలతో పోల్చితే 32.16 లక్షల టన్నుల నుంచి 39.14 లక్షల టన్నులకు పెరిగింది.
► అంతర్జాతీయ మార్కెట్‌లో పలు రకాలు ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. యూరియా ధరలు (రవాణాకు సిద్ధమైన) ఈ ఏడాది జనవరిలో టన్నుకు 44.26 శాతం క్షీణించి   897 డాలర్ల నుండి 500 డాలర్లుగా నమోదయ్యాయి.డీఏపీ ధరలు 26.28 శాతం క్షీణించి టన్నుకు 679 డాలర్లకు చేరాయి. ఫాస్పరిక్‌ యాసిడ్‌ ధర 11.65 శాతం తగ్గి, టన్నుకు 1176 డాలర్లకు తగ్గింది. అమోనియా రేటు 17.42 శాతం తగ్గి, టన్నుకు 928 డాలర్లకు దిగివచ్చింది. సల్ఫర్‌ ధర కూడా టన్నుకు 52.51 శాతం తగ్గి 161 డాలర్లకు చేరింది.  
► కాగా, ఎంఓపీ ధర మాత్రం 2023 జనవరిలో 2022 జనవరితో పోల్చి టన్నుకు 32.58 శాతం పెరిగి 445 డాలర్ల నుంచి 590 డాలర్లకు చేరింది. రాక్‌ ఫాస్పేట్‌ ధర సైతం ఇదే కాలంలో 68.06 శాతం పెరిగి టన్నుకు 144 డాలర్ల నుంచి 242 డాలర్లకు ఎగసింది.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)