Breaking News

భారీగా క్షీణించిన ఎఫ్‌డీఐలు.. కేమన్‌ ఐల్యాండ్స్, సైప్రస్‌ వెనకడుగు

Published on Tue, 12/05/2023 - 07:34

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి ఆరు నెలల(ఏప్రిల్‌–సెప్టెంబర్‌)లో కేమన్‌ ఐలాండ్స్, సైప్రస్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలు భారీగా క్షీణించాయి. వెరసి దేశీయంగా నమోదైన ఎఫ్‌డీఐలు 24 శాతం బలహీనపడ్డాయి. కేమన్‌ ఐల్యాండ్స్‌ నుంచి 75 శాతం తగ్గి 14.5 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో 58.2 కోట్ల డాలర్లు లభించాయి. 

ఇక సైప్రస్‌ నుంచి మరింత అధికంగా 95 శాతం పడిపోయి 3.5 కోట్ల డాలర్లకు చేరాయి. గతంలో 76.4 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇందుకు ఈ రెండు దేశాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించడం ప్రభావం చూపింది. ఈ బాటలో సింగపూర్, యూఏఈల నుంచి సైతం పెట్టుబడులు వెనకడుగు వేశాయి.

అధిక ద్రవ్యోల్బణం కారణంగా యూఎస్, ఇతర పశ్చిమ దేశాలలో వడ్డీ రేట్లు పెరగడం, తూర్పు యూరప్, పశ్చిమాసియాలలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు తదితర అంశాలు భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐలను దెబ్బతీసినట్లు రెగ్యులేటరీ, నాంగియా ఆండర్సన్‌ ఇండియా పార్ట్‌నర్‌ అంజలీ మల్హోత్రా పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా సైప్రస్‌ పెట్టుబడులు వార్షికంగా 62 శాతం తగ్గినట్లు డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ సంజయ్‌ కుమార్‌ తెలియజేశారు. అయితే ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి కేమన్‌ ఐల్యాండ్స్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ రిస్కుల జాబితా(గ్రే లిస్ట్‌) నుంచి తప్పించడంతో రానున్న కాలంలో భారత్‌కు పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)