Breaking News

ఎఫ్‌&వో ట్రేడింగ్‌ అంటే టైమ్‌పాస్‌ కాదు..

Published on Fri, 10/25/2024 - 08:05

ముంబై: ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌ అనేదేమీ టైమ్‌పాస్‌గా చేసే ఆషామాషీ వ్యవహారం కాదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్‌ సభ్యుడు అశ్వని భాటియా వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాలని మార్నింగ్‌స్టార్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు.

సెబీ అధ్యయనం ప్రకారం సంస్థాగత ఇన్వెస్టర్లే ఎఫ్‌అండ్‌వోలో లాభపడుతుండగా, 93 శాతం మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని వెల్లడైన విషయాన్ని భాటియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే  చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలను ఇన్వెస్టర్లు వ్యతిరేకిస్తుండటం సరికాదని ఆయన తెలిపారు.

2020లో కరోనా వైరస్‌ మహమ్మారి తర్వాత నుంచి ఎఫ్‌ అండ్‌ ఓలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అయితే, ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మంచిదేమీ కాదని, ఆందోళనకరమని భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘అంతర్జాతీయంగా నమోదయ్యే డెరివేటివ్స్‌ వాల్యూమ్స్‌లో సగభాగం పైగా వాటా భారత్‌దే ఉండటం గొప్పగా అనిపించినా, ఇది మనం ధరించడానికి ఇష్టపడని కిరీటంలాంటిది’’ అని వ్యాఖ్యానించారాయన.

మరోవైపు, ఎస్‌ఎంఈ ఐపీవోల విషయంలో అసంబద్ధమైన హంగామాను నివారించేందుకు, ధరల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు నియంత్రణ సంస్థ, స్టాక్‌ ఎక్స్చేంజీలు ఈ విభాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయని భాటియా తెలిపారు. త్వరలోనే సెబీ దీనిపై ఒక చర్చాపత్రాన్ని కూడా ప్రవేశపెట్టనుందని వెల్లడించారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)