Breaking News

ఇంటర్నెట్‌ వినియోగదారులకు శుభవార్త!

Published on Fri, 01/19/2024 - 20:45

ఇంటర్నెట్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలో దేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందించే ఎలాన్‌ మస్క్‌ సంస్థ స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతులపై కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ పర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందించే విషయంలో స్టార్‌లింక్‌తో పాటు భారత్‌కు చెందిన రిలయన్స్‌ స్టార్‌లింక్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్‌ వన్‌వెబ్‌లు అనుమతి కోసం కేంద్రానికి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇక తాజాగా స్టార్‌లింక్‌కు డీపీఐఐటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్టార్‌లింక్‌కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు అభిపప్రాయం వ్యక్తం చేశాయి. అయితే దీనిపై ఎలాన్‌ మస్క్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.  

టెలికాం సెక్రటరీ నీరజ్ మిట్టల్, కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఆమోదం కోసం డాట్‌ ఒక నోట్‌ను సిద్ధం చేస్తుంది.వారి ఆమోదం పొందిన తర్వాత, డిపార్ట్‌మెంట్‌లోని శాటిలైట్ కమ్యూనికేషన్స్ వింగ్ (SCW) అధికారికంగా స్టార్‌లింక్‌కి అవసరమైన అనుమతులను మంజూరు చేస్తుంది. దీంతో స్టార్‌లింక్‌ భారత్‌లో తన సేవల్ని వినియోగదారులకు అందించేందుకు దోహదం చేస్తుంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)