Breaking News

2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు

Published on Sat, 09/13/2025 - 20:26

2025 ప్రారంభమై ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయింది. ఇప్పటికే లెక్కకు మించిన కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లు లాంచ్ అయ్యాయి. కాగా ఈ ఏడాది లాంచ్ కావడానికి మరికొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త కారు కొనాలని ఎదురుచూస్తున్న వాళ్లకు.. అవి బహుశా మంచి ఎంపిక కావొచ్చు. జీఎస్టీ సంస్కరణలు కూడా ధరలను కొంత తగ్గేలా చేస్తాయి.

2025 చివరి నాటికి దేశంలో లాంచ్ అయ్యే కార్లు
●మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్
●మారుతి విక్టోరిస్
●టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
●కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ
●టాటా సియెర్రా ఈవీ
●స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్
●వోక్స్‌వ్యాగన్ టేరాన్

మారుతి సుజుకి కొత్త విక్టోరిస్.. ఇప్పటికే షోరూమ్‌లకు రావడం ప్రారంభించింది. కాగా దీని ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. విక్టోరిస్ మూడు పవర్‌ట్రెయిన్ (పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, పెట్రోల్-CNG) ఎంపికలలో లభిస్తుంది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కూడా అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చిన్న డిజైన్ మార్పులు, అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నాయి. నవంబర్‌లో టాటా సియెర్రా ఈవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హారియర్ ఈవీ మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కూడా కొత్త తరం వెన్యూ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.

ఇదీ చదవండి: డీజిల్‌లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన

మహీంద్రా థార్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కానుంది. ఇది థార్ రాక్స్ మాదిరిగానే.. అదే ఇంజిన్, గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది. స్కోడా తన పెర్ఫార్మెన్స్ సెడాన్ ఆక్టేవియా ఆర్ఎస్ లాంచ్ చేయనుంది. దీనిని కంపెనీ భారతదేశానికి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర రూ. 50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వోక్స్‌వ్యాగన్ 2025 చివరి నాటికి టేరాన్ ప్రీమియం 7-సీటర్ లాంచ్ చేసే యోచనలో ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)