Breaking News

నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నం.. కొట్టేసిన కోట్లతో...

Published on Sat, 12/16/2023 - 18:06

Facebook former executive fraud: టాప్‌ కంపెనీలో ఉద్యోగం.. అది కూడా టాప్‌ పొజిషన్‌.. మంచి జీతం..  అయినా ఆమె బుద్ధి గడ్డి తినింది. జల్సాలు, లగ్జరీ లైఫ్‌ కోసం నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నమేసింది. ఏకంగా రూ.33 కోట్లకు పైగా కొట్టేసింది. 

ఫేస్‌బుక్‌లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ విభాగానికి గ్లోబల్ హెడ్‌గా పని చేసిన అర్బరా ఫర్లో స్మైల్స్ అనే 38 ఏళ్ల మహిళ నకిలీ విక్రేతలు, కల్పిత ఛార్జీలు, క్యాష్ కిక్‌బ్యాక్‌ల ద్వారా కంపెనీ నుంచి 4 మిలియన్లకు పైగా (సుమారు రూ. 33 కోట్లు) కొట్టేసినట్లు అంగీకరించింది. కంపెనీలో 2017 నుంచి 2021 సంవత్సరాల కాలంలో కాజేసిన ఈ డబ్బును ఆమె కాలిఫోర్నియా, జార్జియాలో విలాసవంతమైన జీవనం కోసం ఖర్చు చేసింది.

మోసం చేసిందిలాగే..
డబ్బును కాజేసేందుకు ఫర్లో స్మైల్స్ కంపెనీ ఖర్చు ఖాతా వ్యవస్థనే మార్చేసింది. పేపాల్‌, వెన్మో, క్యాష్ యాప్ వంటి చెల్లింపు సేవలకు తన కార్పొరేట్‌ క్రెడిట్‌ కార్డులు లింక్ చేసుకుంది.  వీటి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసినవారికి సంబంధించిన చెల్లింపులకు కంపెనీ సొమ్మును వినియోగించేది. తర్వాత వారి దగ్గర నుంచి కొంత డబ్బును తీసుకునేది. ఈ సొమ్మును నేరుగా, ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ ద్వారా, కొన్నిసార్లు టీ షర్టుల వంటి వాటిలో దాచి ఆమెకు ఇచ్చేవారని ఈ కేసును డీల్‌ చేస్తున్న న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదీ చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్‌ అవుట్‌’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్‌ వాట్సాప్‌ చాట్‌

ఖర్చు చేసింది వీటికే.. 
ఫేస్‌బుక్‌ను మోసం చేసి కాజేసిన సొమ్మును ఫర్లో స్మైల్స్ విలాసాలకు వినియోగించేది. హెయిర్ స్టైలిస్ట్‌లు, బేబీ సిట్టర్‌లకు భారీగా ఖర్చు పెట్టేదని తెలిసింది. పిల్లల ప్రీస్కూల్ ట్యూషన్ ఫీజుకే ఆమె 18,000 డాలర్లు (రూ.14 లక్షలకు పైగా) ఖర్చు చేయడం గమనార్హం. నేరాన్ని బార్బరా ఫర్లో స్మైల్స్ అంగీకరించింది. దీంతో ఆమెకు వచ్చే ఏడాది మార్చి 19న శిక్ష విధించనున్నారు. అప్పటి వరకు ఆమె 5,000 డాలర్లు (రూ.4.15లక్షలు) బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)