Breaking News

'ఎక్స్‌'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్

Published on Sat, 12/06/2025 - 23:57

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్‌కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.

యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టం
డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.

యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.

ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి.

#

Tags : 1

Videos

Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జానియర్ ఎన్టీఆర్

Maoist Leader: మావోలకు భారీ ఎదురుదెబ్బ 3 కోట్లు రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సరెండర్

ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ

ఛీ.. ఛీ.. మీరు రాష్ట్రానికి పట్టిన. రామ్మోహన్ నాయుడు, లోకేష్‌పై రెచ్చిపోయిన KA పాల్

Kethireddy Pedda Reddy: అంతా మీ ఇష్టమా! తాడిపత్రి మీ అడ్డా కాదు

ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!

వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు

Tadepalli : పోలీసుల ఓవర్ యాక్షన్ విద్యార్థి నేతలను లారీ ఎక్కించి..!

Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు

Photos

+5

చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)

+5

సూర్య కొత్త సినిమా లాంచ్.. హీరోయిన్‌గా నజ్రియా (ఫొటోలు)

+5

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం (చిత్రాలు)

+5

Chiranjeevi : మేనేజర్ కుమార్తె బారసాల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (ఫొటోలు)

+5

నేటి తరానికి స్పూర్తి.. మన 'ప్రగతి' విజయం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఈ కాళీ మాత ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

మడత మంచంపై పడుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ లుక్స్.. ఫోటోలు