వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు
Breaking News
రైళ్లలో స్పీకర్‌పై ఫోన్ వాడితే జరిమానా, జైలు
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీ పెట్టుబడులు - సిప్ రూపంలో రూ.17 వేల కోట్లు
Published on Fri, 11/10/2023 - 07:08
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్‌లోనూ ఇన్వెస్టర్ల ఆదరణ చూరగొన్నాయి. నికరంగా రూ.20,000 కోట్లను ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,091 కోట్లతో పోలిస్తే 40 శాతానికి పైగా పెరిగాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నెలవారీగా వచ్చే పెట్టుబడులు రూ.16,928 కోట్ల మైలురాయిని చేరాయి. సిప్ రూపంలో ఒక నెలలో వచ్చిన గరిష్ట స్థాయి పెట్టుబడులు ఇవే కావడం గమనించొచ్చు. అక్టోబర్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. అక్టోబర్ నెలలో నాలుగు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి రాగా, ఇవి రూ.2,996 కోట్లను సమీకరించాయి.
- స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.4,495 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత కొన్ని నెలలుగా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తుండడం గమనించొచ్చు.
- థీమ్యాటిక్ ఫండ్స్ రూ. 3,896 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
- వరుసగా ఐదు నెలల పాటు పెట్టుబడులను కోల్పోయిన లార్జ్‌క్యాప్ పథకాల దశ మారింది. ఇవి నికరంగా రూ.724 కోట్లను రాబట్టాయి.
- డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా రూ.42,634 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో డెట్ విభాగం నుంచి నికరంగా రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లడం గమనార్హం.
- డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.32,694 కోట్లను ఆకర్షించాయి. గిల్ట్ ఫండ్స్‌లోకి రూ.2,000 కోట్లు వచ్చాయి.
- గోల్డ్ ఈటీఎఫ్‌లోకి రూ.841 కోట్లు వచ్చాయి.
- అన్ని విభాగాల్లోకి కలిపి అక్టోబర్‌లో రూ.80,528 కోట్లు వచ్చాయి.
- మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి ఉన్న రూ. 46.58 లక్షల కోట్ల నుంచి రూ. 46.71 లక్షల కోట్లకు పెరిగాయి.
#
Tags : 1