Breaking News

ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ప్చ్‌.. జీతాలే..

Published on Mon, 03/03/2025 - 05:10

న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా జీతాలు మాత్రం పెరగడం లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు అరవింద్‌ విర్మానీ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకు నైపుణ్యాల కొరతే ప్రధాన కారణమని తెలిపారు.  అత్యధిక జనాభాను భారత్‌ ప్రయోజనకరమైన అంశంగా మల్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బోధన, శిక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే డేటా ప్రకారం వర్కర్లు–జనాభా నిష్పత్తి గత ఏడేళ్లుగా పెరుగుతోంది. 

అంటే జనాభా వృద్ధికి మించి ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఉద్యోగాలు పెరగడం లేదనడం తప్పు. క్యాజువల్‌ వర్కర్ల వాస్తవ వేతనాలూ పెరిగాయని, వారి పరిస్థితులూ మెరుగుపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రెగ్యులర్‌ జీతాల ఉద్యోగాలే పెద్ద సమస్యగా ఉంటోంది. ఈ కేటగిరీలో ఏడేళ్లుగా ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా వాస్తవ వేతనాలు పెరగలేదు‘ అని విర్మానీ చెప్పారు. మిగతా దేశాల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపై భారత్‌ మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోందని తెలిపారు.  

జిల్లా స్థాయిలో ఫోకస్‌ చేయాలి.. 
కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రాలు కూడా ఈ దిశగా కసరత్తు చేయాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి అక్కడ దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారికే కాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి కూడా నైపుణ్యాలు అవసరమేనని విర్మానీ చెప్పారు. ‘ఉద్యోగం, నైపుణ్యాలనేవి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. నైపుణ్యాలుంటే ఉద్యోగం దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం అన్ని అంశాల్లోనూ మెరుగుపడాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని వివరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)