Jagtial: 2020 నుంచి మార్చురీలోనే మృతదేహం
Breaking News
ఆర్‌బీఎల్ బ్యాంక్ ఓపెన్ ఆఫర్ @ రూ. 280
Published on Thu, 11/06/2025 - 04:35
న్యూఢిల్లీ: సాధారణ వాటాదారుల(పబ్లిక్) నుంచి ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్ 26 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ప్రైవేట్ రంగ సంస్థ ఆర్‌బీఎల్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఓపెన్ ఆఫర్ డిసెంబర్ 12న ప్రారంభమై 26న ముగియనున్నట్లు వెల్లడించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం షేరుకి రూ. 280 ధరలో 26 శాతం వాటాకు సమానమైన 41,55,86,443 షేర్ల కొనుగోలుకి ఎమిరేట్స్ ఎన్‌బీడీ ఆఫర్ చేపట్టనున్నట్లు తెలియజేసింది.
గత నెలలో ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 60 శాతం వాటా సొంతం చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు యూఏఈ బ్యాంకింగ్ దిగ్గజం ఎమిరేట్స్ ఎన్‌బీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచ్చించనుంది. విలువరీత్యా ఇది దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద డీల్‌కాగా.. అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగానూ నిలవనుంది. ఇటీవల జపనీస్ దిగ్గజం ఎస్‌ఎంబీసీ మరో దేశీ ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌లో 24.9 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో ఎమిరేట్స్ డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. యస్ బ్యాంక్ వాటాకు ఎస్‌ఎంబీసీ రూ. 16,333 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
Tags : 1