Breaking News

26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా జరిగింది!

Published on Tue, 12/10/2024 - 16:08

ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఓ పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో ఇంటర్నెట్ అనేది.. మీడియాలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని పేర్కొన్నారు. 1998లో చెప్పిన ఆ మాటలే నేడు నిజమయ్యాయి.

26 సంవత్సరాల క్రితం 1998లో 'మస్క్'ను ఒక ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్‌సెట్ అని నేను భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొంటూ.. మీడియాకు ఇంధనం ఇంటర్నెట్ అని వివరించారు.

ఇంటర్నెట్.. వినియోగదారులు తాము చూడాలనుకుంటున్న వాటిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది తప్పకుండా సాంప్రదాయ మీడియాలను విప్లవాత్మకంగా మారుస్తుందని మస్క్ స్పష్టం చేశారు. అప్పుడు నేను చెప్పిన మాటలకు చాలామంది నన్ను వెర్రివాడిగా భావించారని మస్క్ లేటెస్ట్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్
ఇలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలని లక్ష్యంతో స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ప్రారభించారు. అపరిమిత డేటా మాత్రమే కాకుండా.. రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్‌ సర్వీస్ అందించడమే దీని లక్ష్యం. భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఇది రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది.

ఇదీ చదవండి: తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?

ఏఐపై మస్క్ వ్యాఖ్యలు
ఇంటర్నెట్‌ గురించి మాత్రమే కాకుండా కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా మస్క్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందని అంచనా వేశారు. భవిష్యత్తులో బహుశా ఎవరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని అన్నారు. ఏఐ, రోబోలు ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు.. సేవలను అందజేస్తాయని ఆయన విశ్వసించారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)