Breaking News

ఎలాన్ మస్క్‌‌కు షాక్.. ఎక్స్ (ట్విటర్)కు రూ.3.21 కోట్లు ఫైన్ - కారణం ఇదే!

Published on Mon, 10/16/2023 - 08:43

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)కు ఆస్ట్రేలియన్ ఇ-సేఫ్టీ కమిషన్ భారీ జరిమానా విధించింది. మూడు లక్షల ఎనభై ఆరు వేల డాలర్ల ఈ జరిమానా మొత్తం భారతీయ కరెన్సీలో దాదాపు రూ.3.21 కోట్లకు సమానం. ఆస్ట్రేలియా ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఎక్స్‌పై ఇంత భారీ జరిమానా వేయడానికి కారణమేమిటని అనుకుంటున్నారా? ఆ వివరాలు ఇవిగో....

సామాజిక మాధ్యమాల్లో చిన్నపిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌పై నిత్యం నిఘా ఉంటుంది. ఆయా సైట్లు ఈ రకమైన కంటెంట్‌ను ఎంత త్వరగా గుర్తించారు? పరిష్కరించారన్న విషయంపై కూడా నిత్యం నియంత్రణ సంస్థల నిఘా ఉంటుంది. అయితే ఎక్స్‌ (ట్విట్టర్‌)  చైల్డ్‌ అబ్యూస్‌ (చిన్న పిల్లల లైంగిక వేధింపులు) కేసు సంబంధించిన దర్యాప్తునకు సహకరించేందుకు నిరాకరించింది. ఇది కాస్తా ఆస్ట్రేలియా ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఆగ్రహానికి కారణమైంది. భారీ ఫైన్‌ విధించింది. కంటెంట్‌ నియంత్రణలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వస్తూండటం... తాజాగా ఈ భారీ జరిమానాల నేపథ్యంలో స్పాన్సరర్లను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎక్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. 

ఇండియాలో ఇప్పటికే ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్
నిజానికి భారత దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కూడా  'చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్' (చిన్న పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించినవి) కంటెంట్‌ను సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని హెచ్చరిస్తూ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. 

ఇదీ చదవండి: యూజ్‌లెస్‌ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్‌ అయ్యాను..

భవిష్యత్తులో కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను కూడా అమలు చేయాలని సూచించింది. ఈ నియమాన్ని పాటించకుంటే 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణిస్తామని ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనకు పాల్పడితే సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)