‘ఎక్స్‌’లో ఉద్యోగాల కోత.. ఇంజినీర్లు ఇంటికి..!

Published on Sat, 11/02/2024 - 19:41

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.

‘ఎక్స్‌’ అమలు చేస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా దాని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులపై పడిందని సంస్థ వర్గాలు, వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లోని పోస్ట్‌లను ఉటంకిస్తూ ‘ది వెర్జ్’‌ నివేదిక పేర్కొంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. కంపెనీ కోసం మీరు చేసేందేంటో ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని ఉద్యోగులను కోరిన రెండు నెలల తర్వాత లేఆఫ్‌లు వచ్చాయి.

దీనిపై మస్క్‌ కానీ, ‘ఎక్స్‌’ అధికారులు గానీ ఇంకా వ్యాఖ్యానించలేదు. స్టాక్ గ్రాంట్‌ల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇటీవల ఎలాన్‌ మస్క్‌  ఈమెయిల్ పంపినట్లు వార్తా నివేదికలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు, ప్రభావం ఆధారంగా వారికి స్టాక్ ఆప్షన్స్‌ కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్టాక్‌ను పొందడానికి కంపెనీకి తాము చేశామో తెలియజేస్తూ నాయకత్వానికి ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని సిబ్బందిని ఆదేశించిట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్‌ సీఈవో ప్రకటన!

ఎలాన్‌ మస్క్ యాజమాన్యంలో ఎంకెన్ని లేఆఫ్‌లు ఉంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌ దాదాపు 80 శాతం అంటే 6,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. డైవర్సిటీ, ఇన్‌క్లూషన్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌ వంటి అన్ని విభాగాల్లోనూ లేఆఫ్‌లు అమలు చేశారు. కంటెంట్ మోడరేషన్ టీమ్‌ను కూడా విడిచిపెట్టలేదు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)