Breaking News

లోగో రీబ్రాండింగ్‌ చిక్కులు: మస్క్‌కు షాకిచ్చిన మార్కెటింగ్‌ ఏజెన్సీ

Published on Wed, 10/04/2023 - 11:48

ట్విటర్‌ బాస్‌  ఎలాన్‌ మస్క్‌లో మరోసారి చిక్కుల్లోపడ్డాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్  ఐకానిక్‌ ‘బర్డ్ లోగో’ను మార్చిదాని ప్లేస్‌లో ‘ఎక్స్’గా మారుస్తూ  ఈ ఏడాది జూలైలో  మాస్క్‌ నిర్ణయం తీసుకున్న సంగతి   తెలిసిందే. తాజాగా దీనిపై  మార్కెటింగ్ ఏజెన్సీ   ఎక్స్‌ అనే  కంపెనీ కాపీరైట్ ఉల్లంఘన  దావా వేసింది. ట్రేడ్‌మార్క్ , సర్వీస్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.  ఈ మేరకు సోమవారం ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ట్విటర్‌ లోగో రీబ్రాండ్  తరువాత ఇలాంటి కోర్టు కేసును  ఎదుర్కోవడం ఇదే తొలిసారి. (ఐటీలో లేఆఫ్స్‌ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!)

ఫ్లోరిడాకు చెందిన అడ్వర్టైజింగ్ ,  సోషల్ మీడియా సర్వీస్ కంపెనీ ఎక్స్‌ ..ట్విటర్‌  పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ ట్రేడ్‌మార్క్‌ "X" గుర్తును ఉపయోగించి  మార్కెటింగ్,  విక్రయించడం లేదా పంపిణీ  లాంటి వాటినుంచి  ఎక్స్‌ను  నిషేధించాలని  కోరుతోంది.  అంతేకాదు మస్క్‌ ఎక్స్‌ సేవలు, ప్రకటనలు తమ వినియోగదారులు గందరగోళానికి గురయ్యారని ఎక్స్‌  పేర్కొంది. తన నష్టాలకు లేదా ప్రతివాది లాభాలకు మూడు రెట్లు సమానమైన పరిహారాన్ని  అందించాలని కోరింది.  ఈ ప్రమాదాన్ని ముందేఊహించిన ట్రేడ్‌ మార్క్‌ నిపుణులు తాజా పరిణామంతో  ఇప్పటికే లాభాలు క్షీణించి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న మస్క్‌కు మరింత దెబ్బేనని భావిస్తున్నారు. 

కాగా గతేడాది ట్విటర్‌ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టాడు. భారతీయ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించడం, వేలాదిమంది  ఇతర ఉద్యోగుల తొలగింపులు, ట్విటర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు వసూలు,  కంటెంట్‌ క్రియేటర్లకు చెల్లింపులు లాంటివి ఉన్నాయి. తాజాగా గేమ్ స్ట్రీమింగ్, ప్లాట్‌ఫారమ్‌ని సరిచేయడానికి లైవ్ షాపింగ్ ఫీచర్‌పై పని చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Videos

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు