Breaking News

ట్విటర్‌కు మహిళా సీఈవో, ఎంపిక చేసిన ఎలాన్ మస్క్.. ఆమె ఎవరంటే?

Published on Fri, 05/12/2023 - 11:18

ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ట్విటర్‌ సీఈవో పదవికి రాజీనామా చేయనున్నారా? ఆయన స్థానంలో మహిళను సీఈవోగా నియమించనున్నారా? ఆరు నెలలుగా నాన్చుతూ వచ్చిన మస్క్‌ కొత్త సీఈవో పదవిపై క్లారిటీ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నారు ట్విటర్‌ బాస్‌.

మరో ఆరు వారాల్లో కొత్త మహిళా సీఈవోని నియమించనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఆమె ఎవరు? అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఎన్‌బీసీ యూనివర్సల్‌ ఎగ్జిక్యూటీవ్‌ లిండా యక్కరినో త్వరలో ట్విటర్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక తెలిపింది. నియామకంపై ఆమెను సంప్రదించగా.. వివరణ ఇవ్వలేదు.  

రూ.3.37లక్షల కోట్లు పెట్టి..
గత ఏడాది మస్క్‌ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసింది. నాటి నుంచి ట్విటర్‌ను ఎవ్రిథింగ్‌ యాప్‌గా మార్చేందుకు శ్రమిస్తున్నారు. ఒకానొక సమయంలో సంస్థలోని మార్పులు కారణంగా ఆఫీస్‌లోనే నిద్రపోవాల్సి వస్తుంది అంటూ వర్క్‌పై తన డెడికేషన్‌ ఎలా ఉందో చెప్పకనే చెప్పారు. 

సీఈవో పదవి నుంచి వైదొలగాలా?
మార్పులు చేర్పులు కొనసాగుతుండగా.. డిసెంబర్‌ నెలలో మస్క్‌ చేసిన ట్విట్‌ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాను ట్విటర్‌ సీఈవో పదవి నుంచి వైదొలగాలా? అని నెటిజన్లను ప్రశ్నించగా.. అందుకు 57.5 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. ఆ పోల్‌ దెబ్బకు ట్విటర్‌ 50 శాతానికి పైగా నష్టపోయింది. 


   
చర్చాంశనీయంగా ఎలాన్‌ మస్క్‌ ప్రకటన
2022 ప్రారంభం నుండి రోజువారీ వినియోగదారులలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రకటనలలు భారీగా తగ్గాయి. ఫలితంగా అక్టోబర్ నుండి ట్విటర్ ఆదాయం 50శాతానికి తగ్గిందని మస్క్‌ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో పాటు ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. వేలాది ఉద్యోగులను తొలగించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గతంలో నిషేధించబడిన ఖాతాలను తిరిగి రావడానికి అనుమతించారు. ఇలా ట్విటర్‌ స్వరూపాన్ని మార్చేసిన మస్క్‌ తాజాగా కొత్త సీఈవోని తెస్తున్నట్లు ప్రకటన చేయడం చర్చానీయాంశంగా మారింది.

చదవండి👉 ‘నిద్ర పోండి..సంపాదించండి’, ట్విటర్‌ ఆఫీస్‌లో ఎలాన్‌ మస్క్‌ సరికొత్త ప్రయోగం!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)