మస్క్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ..

Published on Mon, 02/24/2025 - 15:18

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk)ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ను పునర్నిర్మించడానికి చేసిన ప్రయత్నాలను కొనియాడుతూ.. మరింత దూకుడుగా వ్యవహరించాలని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''ఎలాన్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ అతను మరింత దూకుడుగా ఉండటం నేను చూడాలనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మనం కాపాడుకోవాల్సిన దేశం ఉంది, ఇంతకు ముందు కంటే గొప్పగా చేయాలి" అని అన్నారు.  దీనికి మస్క్ రిప్లై ఇస్తూ.. ''చేస్తాను మిస్టర్ ప్రెసిడెంట్'' అని అన్నారు.

డొనాల్డ్ ట్రంప్.. ఆదేశాల మేరకు ఫెడరల్‌ ఉద్యోగులందరికీ ఒక మెయిల్‌ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్‌ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని ఎలాన్ మస్క్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?

మస్క్‌ తన ట్వీట్‌లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్‌ అందాయి. ఈ మెయిల్‌లో ఐదు బుల్లెట్‌ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం. ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)