Breaking News

గ్రోక్ ఏఐ వీడియో: స్పందించిన మస్క్

Published on Fri, 10/10/2025 - 11:50

టెక్నాలజీ రంగంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో భాగంగానే ఈయన తన ఏఐ వీడియో జనరేషన్ ప్లాట్‌ఫామ్ గ్రోక్ ఇమాజిన్‌కు సంబంధించిన కొత్త వెర్షన్ 0.9ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త వెర్షన్.. ఇప్పటికే రియాలిటీగా కనిపించే వీడియోలను సృష్టించగల సామర్థ్యంతో యూజర్లను తెగ ఆకట్టుకుంది.

ఇండియన్ కంటెంట్ క్రియేటర్ ప్రశాంత్.. ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఐరన్ మ్యాన్ నుంచి ఒక సన్నివేశాన్ని.. రీక్రియెట్ చేసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇక్కడ కనిపించే వ్యక్తి మస్క్‌ను పోలి ఉన్నారు. వీడియో మొత్తం ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. వీడియో షేర్ చేస్తూ.. ''గ్రోక్ ఇమాజిన్ 0.9 సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఐకానిక్ ఐరన్ మ్యాన్ దృశ్యాన్ని తిరిగి ఊహించుకున్నాను. ఇందులో విజువల్ క్వాలిటీ, ఆడియో జనరేషన్ వంటివి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది అద్భుతమైన మోడల్'' అని అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'గ్రోక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 నాట్ బ్యాడ్' అని అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. గ్రోక్ 0.9 వెర్షన్ ఇంత అద్భుతంగా ఉంటే.. 1.0 ఎలా ఉంటుందో అని ఒకరు అన్నారు. గ్రోక్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టిస్తుందని ఇంకొకరు అన్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)