Breaking News

మస్క్ సారథ్యంలోని కంపెనీ ఐపీఓకి రానుందా?

Published on Fri, 11/07/2025 - 13:41

ఎలాన్ మస్క్ తన రాకెట్ తయారీ సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)ను పబ్లిక్ కంపెనీగా మార్చబోతున్నట్లు హింట్‌ ఇచ్చారు. టెస్లా 2025 వాటాదారుల సమావేశంలో ఆయన చేసిన ప్రకటన వల్ల స్పేస్ఎక్స్ ఇనిషియల్‌ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) వచ్చే అవకాశం ఉంటుందని కొందరు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

టెస్లా (Tesla) 2025 వాటాదారుల సమావేశంలో మాట్లాడుతూ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓ గురించి వ్యాఖ్యలు చేశారు. ‘టెస్లా వాటాదారులు స్పేస్ఎక్స్‌ వృద్ధిలో పాల్గొనడానికి ఏదైనా మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాను. అది చాలా మేలు చేస్తుంది. స్పేస్ఎక్స్ కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాల్లో పాలుపంచుకోవడానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే ఇతర కంపెనీల్లో స్టాక్స్‌ కలిగి ఉన్న మద్దతుదారులు స్పేస్ఎక్స్ స్టాక్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, ఏ సమయంలో అది జరుగుతుందో కచ్చితంగా చెప్పలేను. అయితే ఏదో ఒక సమయంలో మాత్రం స్పేస్ఎక్స్ పబ్లిక్ కంపెనీగా మారాలి’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల్లో ఒకటైన స్పేస్ఎక్స్ భవిష్యత్తుపై, సాధారణ ప్రజలు పెట్టుబడి పెట్టే అవకాశంపై ఊహాగానాలకు దారితీశాయి.

స్పేస్ఎక్స్

  • 2002లో ఎలాన్ మస్క్ దీన్ని స్థాపించారు. స్పేస్ఎక్స్ (స్పేస్ఎక్స్‌ప్లోరేషన్‌ టెక్నాలజీస్ కార్ప్) టెక్సాస్‌లోని బ్రౌన్స్ విల్లేలో ఉన్న స్టార్ బేస్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. లో-ఎర్త్‌ ఆర్బిట్‌ నుంచి అంతరిక్ష నౌకను విజయవంతంగా తిరిగి భూమిపైకి తెచ్చిన సంస్థగా గుర్తింపు పొందింది.

  • ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అంతరిక్ష నౌక (డ్రాగన్ 2)ను విజయవంతంగా డాక్ చేసింది.

  • స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు పునర్వినియోగానికి వీలుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా?

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)