Breaking News

మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్

Published on Sat, 09/02/2023 - 19:59

అపర కుబేరుడు & టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలియని వారు ఉండరు. అయితే త్వరలోనే ఈయన జీవిత చరిత్రకు సంబంధించిన బుక్ ఒకటి విడుదలకానున్నట్లు సమాచారం. అందులో మస్క్ గురించి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఆయన కుమార్తె 'జెన్నా'తో ఉన్న విభేదాలను గురించి వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి ఎలాన్ మస్క్ మాజీ భార్య 'జస్టిస్ విల్సన్' ద్వారా ఇద్దరు కుమారులు జన్మించారు. వారు 'జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్'. అయితే మస్క్ 2008లో జస్టిస్‌కి విడాకులిచ్చాడు. ఆ తరువాత జేవియర్ అలెగ్జాండర్ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారి 'వివియన్ జెన్నా విల్సన్'గా మారింది. తండ్రి మీద ఉన్న కోపంలో ఇలా చేసుకున్నట్లు గతంలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. మస్క్ జెన్నాను కలుసుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఆమెకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువగా ఉండటం. దీంతో డబ్బున్నవారందరూ చెడ్డవాళ్లే అని దృడంగా నమ్మి తనకు దూరంగా ఉంటోంది. జెన్నా ఎప్పుడూ నాతో కొంచెం సమయం కూడా గడపడానికి ఇష్టపడలేదు, ఇది తనను ఎంతో బాధకు గురిచేసినట్లు వెల్లడించాడు.

ఇదీ చదవండి: మొదటి సారి నా భార్యను అక్కడే కలిసాను - ఆనంద్ మహీంద్రా

ఇది నా మొదటి కుమార్తె 'నెవాడా' (Nevada) మరణం కంటే కూడా చాలా బాధించిందని తెలిపాడు. ఇవన్నీ కూడా మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో ఉన్నట్లు సమాచారం. ఈ బుక్ ఈ నెల 12న (2023 సెప్టెంబర్ 12) విడుదలయ్యే అవకాశం ఉంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)