Breaking News

మస్క్, ఆల్ట్‌మన్ మధ్య ట్వీట్ల యుద్ధం: ఎవ్వరూ తగ్గట్లే!

Published on Tue, 02/11/2025 - 14:51

టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన చూపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'ఓపెన్ఏఐ' (OpenAI) మీద పడింది. ఈ కంపెనీని కొనుగోలు చేస్తా అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు.

2024లో రెండుసార్లు OpenAIపై దావా వేసిన మస్క్ ఇప్పుడు.. సంస్థనే కొనుకోలు చేయడానికి సిద్ధమయ్యాయి. 97.4 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) కొనుగోలు చేస్తామంటూ.. మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఆఫర్ ఇచ్చింది. దీనిని ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' (Sam Altman) తిరస్కరించారు.

మీ ఆఫర్‌కు ధన్యవాదాలు, మీకు కావాలంటే మేము ఎక్స్(ట్విట్టర్‌)ని 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 85వేలకోట్లు) కొనుగోలు చేస్తామని ఆల్ట్‌మన్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుపై మస్క్ స్పందిస్తూ.. 'మోసగాడు' అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓపెన్ఏఐ
నవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్‌మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.

ఇదీ చదవండి: ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..

2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు. అంతలోనే మస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం తెరమీదకు వచ్చింది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)