Breaking News

పేరు మార్చుకున్న మస్క్.. వినడానికే వింతగా ఉంది!

Published on Tue, 12/31/2024 - 17:37

ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన పేరును మార్చుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్‌టాపిగ్‌గా మారింది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

ఒకవైపు బిజినెస్, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న మస్క్.. తాజాగా తన ఎక్స్ (Twitter) అకౌంట్ పేరును 'కేకియస్ మాక్సిమస్' (Kekius Maximus)గా మార్చుకున్నారు. వినడానికి ఈ పేరు వింతగా ఉన్నప్పటికీ.. దీనికో అర్థం కూడా ఉంది. కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్. ఇది అనేక బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

ఇలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే తన ఎక్స్ ఖాతా పేరును.. క్రిప్టో కరెన్సీ అర్థం వచ్చేలా మార్చుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2023లో కూడా తన ఎక్స్ అకౌంట్ పేరును 'మిస్టర్ ట్వీట్'గా మార్చుకున్నారు.

సంపదలో మస్క్ కొత్త రికార్డ్ 
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్‌ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.

ఇదీ చదవండి: ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం

2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)