ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం అంతరాయం
Breaking News
పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’
Published on Wed, 07/02/2025 - 17:55
పుట్టకతోనే చెవిటివారా లేదా చెవిలో మిషన్ పెట్టనిదే బయట శబ్దాలు వినిపించట్లేదా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. పుట్టకతోనే ఎవరైనా పూర్తిగా చెవిటివారుగా ఉన్న సందర్భాల్లోనూ వినికిడిని పొందేందుకు న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ సహాయపడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్ తెలిపారు. వినికిడి లోపం గురించి యూజర్లను హెచ్చరించిన ఎక్స్‌లోని ఒక పోస్ట్‌కు ప్రతిస్పందనగా మస్క్ ఈమేరకు వివరాలు వెల్లడించారు.
కెర్నల్ కంపెనీ సీఈఓ బ్రెయిన్ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ..‘మీ చెవులను సంరక్షించుకోండి. వినికిడి కోల్పేతే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో లేవు. డెమెన్షియా వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం 5 రెట్లు ఉంటుంది. 30–40% మెదడుపై ప్రభావం పడుతుంది. ఒకసారి చెవి లోపలి కణాలు పాడైతే సహజ వినికిడిని పునరుద్ధరించలేం. కాబట్టి మీ చెవులకు గరిష్టంగా 80 డెసిబుల్స్ మించి శబ్దాలను దరిచేరకుండా జాగ్రత్తపడండి. శబ్దాలను కొలిచే యాప్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.
దీనికి ప్రతిస్పందనగా మస్క్..‘వినికిడిని పునరుద్ధరించడానికి న్యూరాలింక్ ద్వారా ఒక స్పష్టమైన మార్గం సూచిస్తుంది. పుట్టినప్పటి నుంచి పూర్తిగా వినికిడి లేనివారికి కూడా వినికిడి వచ్చేలా చేయవచ్చు. ఎందుకంటే న్యూరాలింక్ పరికరం ధ్వనిని ప్రాసెస్ చేసే మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్ చేస్తుంది’ అని చెప్పారు.
There is a clear path to restoring hearing with a @Neuralink, even for someone who has had total loss of hearing since birth, as our device directly activates the neurons in the brain that process sound https://t.co/h5CeELct5m
— Elon Musk (@elonmusk) June 28, 2025
ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’
ఇదిలాఉండగా, ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ ఇప్పటికే రెండో ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని కంపెనీ గతంలో తెలిపింది.
Tags : 1