Breaking News

చిన్న ట్వీట్ తో 3వ స్థానానికి ఎలోన్ మస్క్

Published on Wed, 05/19/2021 - 14:57

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన రెండవ స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు రెండవ స్థానంలో ఎల్విఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. గత వారం గ్లోబల్ స్టాట్ ఆఫ్ టెక్నాలజీ స్టాక్స్ తర్వాత టెస్లా షేర్లు బాగా పడిపోయాయి. మార్చిలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచికలో అగ్రస్థానంలో ఉన్న మస్క్ సంపద 160.6 బిలియన్ డాలర్ల(24 శాతం)కు తగ్గింది. దీనికి ప్రధాన కారణం టెస్లా ఇకపై డిజిటల్ కరెన్సీ బిట్‌ కాయిన్లను చెల్లింపుగా అంగీకరించట్లేదని మస్క్ మే 13న ట్వీట్ చేయడమే. ట్వీట్ చేసిన తర్వాత బిట్‌ కాయిన్ల షేర్ విలువ 6.2 శాతం తగ్గింది. ప్రస్తుతం బిట్‌ కాయిన్‌ ధర 42,185 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 8 తర్వాత ఇదే తక్కువ. ఫిబ్రవరి 8న బిట్‌ కాయిన్‌ 43,564 డాలర్లు పలికింది. 

టెక్నాలజీ ఆధారిత స్టాక్స్‌లో గత ఏడాది కరోనా విజృంభణ కాలంలో టెస్లా షేర్లు దాదాపు 750 శాతం పెరిగిన తర్వాత జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్ నిలిచాడు. కానీ, ఎక్కువ రోజులు ఈ స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టెస్లా అధిక లాభాలను నమోదు చేయగా, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ కొరత, సాంప్రదాయ వాహన తయారీదారుల నుంచి పెరుగుతున్న పోటీ మధ్య దాని వాటాలు ఐదవ వంతు తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. బిట్‌ కాయిన్లను ఎందుకు అంగీకరించలేదంటే? బిట్‌ కాయిన్ల తయారీ, లావాదేవీలకు ఫాజిట్‌ ఫ్యూయల్స్‌ వాడుతారనే విషయం తెలిసిందే. అందులో ఎక్కువ శాతం బొగ్గు ఉంటుంది. రకరకాల ఇంధనాల వృథా నుంచి బొగ్గు తయారవుతుంది కాబట్టి అందుకే బిట్‌కాయిన్లను ప్రోత్సహించం అని ట్వీట్‌లో మస్క్‌ పేర్కొన్నాడు.

ఈ సంవత్సరం మస్క్ సంపాదన 9 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. టెస్లా సీఈఓను అధిగమించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ తన నికర విలువ సంపాదన భారీగా పెరగింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాలలో తన సంస్థ విలాస వస్తువుల అమ్మకాలు పెరగడంతో 72 ఏళ్ల అతని సంపాదన నికర విలువ 47 బిలియన్ డాలర్ల నుంచి 161.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో జెఫ్ బేజోస్, రెండవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్, మూడవ స్థానంలో ఎలోన్ మస్క్ నిలిచారు. ఇక తర్వాత స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలిగేట్స్ ఉన్నారు.

చదవండి:

ఐటీ కొలువుల మేళా: భారీగా టెకీల నియామ‌కం!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)