Breaking News

‘తప్పు చేస్తున్నావ్‌ ఆల్ట్‌మన్‌’.. చాట్‌జీపీటీ సృష్టికర్తపై మస్క్‌ ఆగ్రహం!

Published on Fri, 03/01/2024 - 16:53

అపరకుబేరుడు ఎలోన్‌ మస్క్‌ కోర్టు మెట్లెక్కారు. 2015 చాట్‌జీపీటీ తయారీలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించారంటూ చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్‌ ఏఐ కో-ఫౌండర్‌ సామ్ ఆల్ట్‌మాన్‌తో పాటు పలువురిపై శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు.

దావాలో సామ్ ఆల్ట్‌మాన్, ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్‌తో కలిసి మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా లాభపేక్షలేకుండా కృత్రిమ మేధస్సు సాంకేతికతను అభివృద్ధి చేసేలా మస్క్‌ను కలిశారు. అప్పటికే వ్యాపార రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మస్క్‌ను వ్యాపారం, ఆర్ధికంగా మద్దతు కావాలని కోరారు.

మస్క్‌తో కలిసి ఉమ్మడిగా ఓపెన్‌ఏఐ సంస్థను ఏర్పాటు చేశారు. చాట్‌ జీపీటీపై పనిచేశారు. అయితే ఆ సమయంలో మస్క్‌-ఆల్ట్‌మన్‌లు ఓ బిజినెస్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. ఇప్పుడు దానిని ఆల్ట్‌మన్‌ అతిక్రమించారంటూ కోర్టులో వేసిన దావాలో మస్క్‌ తరుపు న్యాయ వాదులు పేర్కొన్నారు. 


అయితే, తనతో ఆల్ట్‌మన్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లగా కాకుండా కంపెనీ ఇప్పుడు లాభపేక్షతో వ్యాపారం చేస్తూ ఆ అగ్రిమెంట్‌ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఎలోన్ మస్క్ తరపు న్యాయవాదులు వ్యాజ్యంలో హైలెట్‌ చేశారు. ఈ దావాపై ఓపెన్‌ ఏఐ, ఆ కంపెనీకి మద్దతిస్తున్న మైక్రోసాఫ్ట్‌, ఇటు ఎలోన్‌ మస్క్‌లు స్పందించాల్సి ఉంది. 

చదవండి👉 ఇంతకీ ఈ రామేశ్వరం కేఫ్‌ ఎవరిది?

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)