Breaking News

అవి ‘అర్ధం, పర్ధం లేని మాటలే’.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

Published on Wed, 07/05/2023 - 12:16

ఎక్కువ మంది పిల్లలుంటే జనాభా సంక్షోభాన్ని తగ్గించొచ్చని అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వాదిస్తున్నారు. అయితే, తాజాగా పిల్లలు, ఓటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ఓ యూజర్‌ చేసిన ట్వీట్‌కు స్పందించిన మస్క్‌..సంతానం లేని వారు ఓటు వేసేందుకు అనర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ట్విటర్‌ యూజర్‌ డేటాహజార్డ్ ‘తల్లిదండ్రులకు ఓటు హక్కును పరిమితం చేయకుండా ప్రజాస్వామ్యంలో ఆచరణ సాధ్యం కాదంటూ చేసిన ట్వీట్‌కు ప్రతిస‍్పందించారు. ఆ కామెంట్‌ను సమర్ధిస్తూ మస్క్‌ రిప్లయి ఇచ్చారు. 

గత ఏడాది జననాల రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇన్ సమ్మిట్‌లో మాట్లాడుతూ .. కొంతమంది తక్కువ పిల్లలుంటే పర్యావరణానికి మంచిదని భావిస్తారు. ఇది అర్ధం లేని వ్యవహారం. జనాభా పెరుగుతున్నప్పటికీ పర్యావరణం బాగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.

అర్ధం పర్ధం లేని మాటలు
అందుకు జపాన్‌లో క్షీణిస్తున్న జననాల రేటును ఉదహరించారు. 2021లో జపాన్ జనాభా 600,000 మంది క్షీణించిందని, తద్వారా తన ఉనికిని కోల్పేయే ప్రమాదం ఉందని అన్నారు.జనాభా ఎక్కువగా ఉంటే ప్రపంచ నాగరికత క్షీణించదని, పిల్లలను కలిగి ఉండటం పర్యావరణానికి హానికరం కాదని తన వైఖరిని కూడా స్పష్టం చేశారు. నాగరికతను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమని పేర్కొన్నారు. 



చైనాలో జనాభా
చైనాలో జనాభా పెరుగుదల రేటు భారీ స్థాయిలో పడిపోతోందంటూ వచ్చిన పలు నివేదికలపై మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే చైనా జనాభా పతనాన్ని చవిచూడనుందని హెచ్చరించారు. చైనాలో జననాల రేటు గణనీయంగా క్షీణిస్తోందని .. రానున్న రోజుల్లో మరింత పతనం అవుతుందని అంచనా వేశారు.

చదవండి👉 విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్‌’కు ఎదురు దెబ్బ!

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)