Breaking News

హైదరాబాద్‌లో ఎలి లిల్లీ తయారీ కేంద్రం ఏర్పాటు

Published on Mon, 10/06/2025 - 14:30

గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Company) భారతదేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి 1 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం భారతదేశం అంతటా కంపెనీ కాంట్రాక్ట్ తయారీ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులను ప్రశంసించారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ ఆవిర్భవించడానికి సంకేతమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమైన మౌలిక సదుపాయాలు, సులభతర వ్యాపారం (Ease of Doing Business) వంటి అంశాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకం అవుతున్నట్లు చెప్పారు.

కంపెనీ ఏర్పాటు చేయబోయే అత్యాధునిక సదుపాయంలో ఇంజినీర్లు, రసాయన శాస్త్రవేత్తలు, ఇతర శాస్త్రవేత్తలు, నిపుణుల కోసం తక్షణమే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు బలాన్ని ఇస్తూ వినూత్న ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ జాన్సన్ మాట్లాడుతూ..‘మా గ్లోబల్ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రంగా భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. లిల్లీ డయాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్.. వంటి వాటికి ఔషధాలు తయారు చేస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్‌ కేంద్రంగా కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)