Breaking News

హైదరాబాద్‌లో ఈ-వాహనాలదే హవా

Published on Sat, 08/16/2025 - 15:38

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ– బండి టాప్‌గేర్‌లో పరుగులు తీస్తోంది. ఈవీలపై  జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు  రోడ్డెక్కాయి. కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్‌ వర్గాలు  తెలిపాయి.

ఈ సంవత్సరం  కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్‌ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్‌లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు  నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097  ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్‌ వాహనాలు  ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు.

ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు  రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్‌ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్‌ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని  హైదరాబాద్‌ జేటీపీ రమేష్‌  సూచించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)