Breaking News

భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీ

Published on Thu, 08/21/2025 - 19:15

ఈ20 ఫ్యూయెల్ చుట్టూ ఉన్న గందరగోళాల మధ్య.. 'హైడ్రోజన్' భవిష్యత్ ఇంధనం అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. హైడ్రోజన్, బయో ఇంధనాలు & ఎలక్ట్రిక్ వాహనాలు రవాణా.. పరిశ్రమల భవిష్యత్తు అని ఆయన స్పష్టం చేశారు.

శిలాజ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుంది. ఇది కేవలం రవాణాకు మాత్రమే కాకుండా.. పరిశ్రమలకు కూడా కీలకంగా మారుతుందని గడ్కరీ అన్నారు. రైళ్లు హైడ్రోజన్ ద్వారానే నడుస్తాయి, విమానాలు హైడ్రోజన్‌తో ఎగురుతాయని అన్నారు. భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ఉండదని పేర్కొన్నారు.

ఆటోమొబైల్ మార్కెట్లో భారత్
ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో భారతదేశం ఎదుగుదలను నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. ఇండియా ఇటీవల జపాన్‌ను అధిగమించి దేశం ఏడవ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుకుందని అన్నారు. అమెరికన్ ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 78 లక్షల కోట్లు, చైనా విలువ రూ. 49 లక్షల కోట్లు, కాగా భారతదేశం విలువ రూ. 22 లక్షల కోట్లు. రాబోయి రోజుల్లో ఆటోమొబైల్ రంగంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

కొన్ని రోజుల క్రితం, మెర్సిడెస్ గ్లోబల్ చైర్మన్..  భారతదేశంలో ఎలక్ట్రిక్ మెర్సిడెస్ కార్లను తయారు చేస్తామని నాకు చెప్పారని నితిన్ గడ్కరీ చెప్పారు. రవాణా & పరిశ్రమ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనాలు, హైడ్రోజన్‌పై ఆధారపడి ఉంది. వీటి వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని చెప్పారు.

ఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్‌ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్

హైడ్రోజన్ ఇంధనం గురించి మాట్లాడుతూ.. చమురు ఉత్పత్తి చేసే దేశాలను చౌకైన హైడ్రోజన్‌తో భారతదేశం సమం చేయగలదని గడ్కరీ అన్నారు. హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చును తగ్గించగలిగితే.. భారతదేశం ఇంధన దిగుమతిదారు నుంచి ప్రపంచ ఎగుమతిదారుగా మారగలదని అన్నారు. అయితే హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)