Breaking News

మహాదేవ్‌ యాప్‌.. రూ.1,700 కోట్ల ఆస్తులు జప్తు!

Published on Fri, 03/27/2026 - 07:37

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్‌ ఆన్‌లైన్ బుక్’ బెట్టింగ్ సిండికేట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో అడుగు వేసింది. ఈ అక్రమ బెట్టింగ్ సామ్రాజ్య సూత్రధారులైన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌కు చెందిన సుమారు రూ.1,700 కోట్ల విలువైన విలాసవంతమైన ఆస్తులను అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ 5(1) కింద మార్చి 24న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమ బెట్టింగ్‌ల ద్వారా సంపాదించిన నేరపూరిత ఆదాయంతోనే ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.

బుర్జ్ ఖలీఫాలో అపార్ట్‌మెంట్లు!

జప్తు చేసిన ఆస్తుల్లో దుబాయ్‌లోని 18 స్థిరాస్తులతో పాటు న్యూఢిల్లీలోని రెండు కీలక ఆస్తులు ఉన్నాయి. విదేశాల్లోని ఆస్తులు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ హిల్స్ ఎస్టేట్‌లో అత్యున్నత శ్రేణి విల్లాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. బిజినెస్ బే, ఎస్‌ఎల్‌ఎస్‌ హోటల్‌లో ఖరీదైన నివాస సముదాయాలున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీఫాలో కూడా వీరికి అపార్ట్‌మెంట్లు ఉండటం గమనార్హం.

బినామీ నెట్‌వర్క్ గుట్టురట్టు

తమ యాజమాన్య హక్కులను దాచడానికి మహదేవ్‌ యాప్‌కు చెందిన రెండు షెల్ కంపెనీలు బినామీల పేరుతో ఒక పెద్ద నెట్‌వర్క్‌ను నడిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దుబాయ్ హిల్స్‌లోని ‘హిల్స్ వ్యూ’లో ఉన్న విల్లా నంబర్ 36 చంద్రకర్ ప్రధాన నివాసమని గుర్తించారు. దీన్ని ‘పర్ఫెక్ట్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎల్‌ఎల్‌సీ’ పేరుతో కొనుగోలు చేశారు. ఇందులో చంద్రకర్‌కు 95% వాటా ఉంది. రవి ఉప్పల్ అధీనంలో ఫెయిర్‌వే రెసిడెన్సీ క్లస్టర్‌లోని విల్లా నంబర్ 33 ఉన్నట్లు సమాచారం. అతుల్ అగర్వాల్ (విల్లా 50), శుభం సోని (విల్లా 13), విశాల్ రమణి (విల్లా 31) వంటి సన్నిహితుల పేరుతో ఉన్న ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.

ఇప్పటివరకు రూ.4,336 కోట్ల ఆస్తులు జప్తు

ఈ తాజా జప్తుతో కలిపి మహాదేవ్ యాప్ కేసులో ఇప్పటివరకు ఈడీ అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.4,336 కోట్లకు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా చంద్రకర్ కనీసం 35 నుంచి 40 విల్లాలు, అపార్ట్‌మెంట్‌లను నియంత్రిస్తున్నారని దర్యాప్తు సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్, అతుల్ అగర్వాల్, శుభం సోనీలను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది. దీని ద్వారా వారి ఆస్తులను పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం కలుగుతుంది.

ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు!

 

Videos

టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు

కరీంనగర్ RBL బ్యాంక్ లో భారీ కుంభకోణం

అమెరికా సంచలన నిర్ణయం కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం

2 నెలల దాకా నో టెన్షన్.. దేశంలో 8 లక్షల టన్నుల LPG నిల్వలు

కడపలో ఆధిపత్య పోరు టీడీపీ ఇంఛార్జ్ ఆవుల వెంకటేష్ పై దాడి

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు

రణరంగంగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఖమేనీ హత్యను ఖండిస్తూ విపక్షాల నిరసన

తాడిపత్రి బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు

వైద్య విద్య అందించలేని తండ్రీకొడుకులు బాబు,లోకేష్ పై AISF నేతలు ఫైర్

Photos

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)