Breaking News

సుప్రీం కోర్టు ఆమోదంతో రూ.4,025 కోట్ల ఆస్తులు అప్పగింత

Published on Sat, 12/14/2024 - 14:15

సుప్రీం కోర్టు ఆమోదం మేరకు భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు చెందిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు అందజేసింది. దీనికి సంబంధించి ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ తాజాగా వివరాలు వెల్లడించింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదం మేరకే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీలో మేజర్‌ వాటాలు కొనుగోలు చేసినట్లు గుర్తించడంతో ఆస్తులు అందజేస్తున్నట్లు పేర్కొంది.

బ్యాంకు రుణ చెల్లింపుల్లో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై 2019లో భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆస్తులను జప్తు చేసింది. అంతకుముందు నెలలో ఆ రుణాలు చెల్లించలేక కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించింది. ఆ సమయంలో భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ సమస్యకు సంబంధించి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ పరిష్కార ప్రణాళికను ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. తర్వాత ఈడీ ఆస్తులను జప్తు చేసింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదంతోనే కంపెనీలో వాటాను చేజిక్కించుకునేందుకు బిడ్‌ వేసినట్లు సుప్రీం కోర్టులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి: రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..

జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ను 1982లో సజ్జన్ జిందాల్ స్థాపించారు. జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (జిస్కో), జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ (జేవీఎస్ఎల్) కలిసి జిందాల్‌ స్టీల్‌గా ఏర్పడ్డాయి. ఈ కంపెనీ యూఎస్‌లో ఏటా 35.7 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని అతిపెద్ద తయారీ యూనిట్ కర్ణాటకలోని విజయనగరలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ఉక్కు ఉత్పత్తి కేంద్రం.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)