Breaking News

37 గుర్రాలను అటాచ్‌ చేసిన ఈడీ.. విలువ రూ.3.98 కోట్లు!

Published on Thu, 12/05/2024 - 13:42

అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్ వర్క్, మనీ లాండరింగ్‌, అక్రమ ఆస్తుల ఆరోపణల వల్ల మెట్ టెక్నాలజీస్ యజమాని కునాల్ గుప్తా, తన సహచరుడు పవన్ జైస్వాల్‌కు చెందిన రూ.5.23 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ చర్యల్లో భాగంగా కేజీ స్టడ్ ఫామ్ ఎల్‌ఎల్‌పీకి చెందిన 37 గుర్రాలను సైతం ఈడీ అటాచ్‌ చేసింది. వీటి విలువ రూ.3.98 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. గ్రీన్‌లీఫ్ కాంప్లెక్స్, బాగుయాటి, కోల్‌కతాలోని రూ.1.08 కోట్ల విలువైన ఫ్లాట్లను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ కేసు ఈ కేసులో ఈడీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, నవంబర్ 2023లో ఏజెన్సీ రూ.67.23 కోట్లు, జులై 2024లో రూ.85 లక్షల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.

మోసపూరిత వ్యాపార ఒప్పందాలు

కునాల్ గుప్తా, అతని సహచరులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత కాల్ సెంటర్‌లను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ యాప్‌ల ద్వారా తప్పుడు రుణ ఆఫర్‌లు, మోసపూరిత వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్‌ఎల్‌పీ, జీడీ ఇన్ఫోటెక్‌తో సహా పలు సంస్థల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రేసింగ్‌లో వచ్చిన డబ్బు పెట్టుబడిగా..

కునాల్‌గుప్తా, పవన్‌ జైస్వాల్‌ నిబంధనలకు విరుద్ధంగా తమ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరిపింది. ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని ఆస్తులను, గుర్రాలను అటాచ్‌ చేసింది. సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేజీ స్టడ్ ఫార్మ్‌ ఎల్‌ఎల్‌పీ గుర్రాలను కొనుగోలు చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం, అమ్మడం వంటి చేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ద్వారా నిధులను దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. నేరారోపణలతో ముడిపడి ఉన్న గుర్రాల ద్వారా రేస్‌లో సంపాదించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో 37 గుర్రాలను ఈడీ అటాచ్‌ చేసింది. వీటిని వివిధ రేస్ క్లబ్‌లు, రైడింగ్ పాఠశాలల్లో ఉంచుతున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్‌ ఫోన్లు

లెక్కల్లోలేని లావాదేవీలు

జీడీ ఇన్ఫోటెక్ ద్వారా పవన్ జైస్వాల్ గ్రీన్‌లీఫ్ కాంప్లెక్స్‌లో అక్రమంగా ఆస్తులను సంపాదించినట్లు ఈడీ తెలిపింది. లెక్కల్లోలేని ఆర్థిక లావాదేవీలు, నగదు డిపాజిట్లు, చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేకుండా నగదు బదిలీ చేయడం ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ వెల్లడించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)