Breaking News

పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2025-26 విడుదల

Published on Thu, 01/29/2026 - 10:58

దేశ ఆర్థిక వ్యవస్థ గమనానికి దిక్సూచిగా భావించే ఆర్థిక సర్వే (Economic Survey) 2025-26ను కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్‌ నేడు (గురువారం, జనవరి 29, 2026) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ కంటే ముందు వెలువడే ఈ కీలక పత్రం గత ఆర్థిక సంవత్సరంలో దేశం సాధించిన ప్రగతిని, రాబోయే సవాళ్లను విశ్లేషిస్తుంది.

ప్రధాన అంశాలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ సర్వేను సమర్పించారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ విలేకరుల సమావేశంలో పాల్గొని దేశ ఆర్థిక పోకడలపై సమగ్ర వివరణ ఇవ్వనున్నారు.

జనవరి 28న ప్రారంభమైన ఈ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థిక వృద్ధి అంచనాలు

భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశం 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా. ఇది గతంలో ఊహించిన 6.3 - 6.8 శాతం కంటే మెరుగ్గా ఉండటం విశేషం. పటిష్టమైన దేశీయ వినియోగం, తయారీ రంగంలో వృద్ధి దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

బడ్జెట్‌ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి?

ఆన్‌లైన్‌లో indiabudget.gov.in(https://www.indiabudget.gov.in) అధికారిక వెబ్‌సైట్‌, సాక్షి.కామ్‌లోని లైప్‌ అప్‌డేట్ల ద్వారా బడ్జెట్‌ వివరాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారిక పేజీలతోపాటు ఫేస్‌బుక్‌లోకి ‘సాక్షి’ పేజీని ఫాలో అయి తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: గోల్డ్‌ ధర.. గుండె దడ!

Videos

Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది

రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్

పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్

100 మంది 10 నిమిషాల్లో. కడపలో TDP చేసిన విధ్వంసం

Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే

YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు

నా పార్టీ ఏంటో చూపిస్తా అన్నావ్ ఇప్పుడు ఏం అంటావ్ పవన్

Photos

+5

రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ సావిత్రి బేబీ బంప్‌ స్టిల్స్ (ఫొటోలు)

+5

మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు