Breaking News

కష్టజీవులపై చలానాస్త్రం! ‘రూ.9.6 లక్షలు పిండేశాం’

Published on Mon, 03/03/2025 - 13:40

నగరాలలో పొట్టకూటి కోసం చిరుద్యోగాలు చేసుకునే కష్టజీవులు చాలా మంది కనిపిస్తారు. వీరిలో ముఖ్యంగా ఈ-కామర్స్‌ సంస్థలకు డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తూ పొట్టపోసుకునేవారే ఎక్కువ. రోజంతా రోడ్లపై తిరుగుతూ కష్టపడితే పదో పాతికో సంపాదిస్తారు. వీళ్లనే టార్గెట్‌ చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. చిన్న చిన్న ఉల్లంఘనల పేరుతో జరిమానాల రూపంలో లక్షల రూపాయలు పిండేశారు.

నిబంధనలు ఉల్లంఘించే ఈ-కామర్స్ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు శనివారం (మార్చి 1) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1,859 మంది నుంచి జరిమానాల రూపంలో రూ.9.6 లక్షలు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడటం రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా, ఈ-కామర్స్ డెలివరీ వాహనాల ద్వారా పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

స్పెషల్ డ్రైవ్ లో ఎక్కువగా ఈ-బైకులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎంఎన్ అనుచేత్ తెలిపారు. ఈ వాహనాలు ఎక్కువగా మైక్రో మొబిలిటీ వాహనాలు, వాటి వినియోగదారులకు నిబంధనలు తెలియవు. మైక్రో మొబిలిటీ వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు లేవని, వాటి వినియోగదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

చిరు ఉల్లంఘనలు
ఫుట్ పాత్ లపై ప్రయాణించినందుకు 79 మంది, నో ఎంట్రీ నిబంధనను ఉల్లంఘించినందుకు 389 మంది, వన్ వేకు విరుద్ధంగా ప్రయాణించినందుకు 354 మంది, సిగ్నల్ జంప్ చేసినందుకు 209 మంది, హెల్మెట్ ధరించనందుకు 582 మంది, రాంగ్‌ పార్కింగ్ చేసినందుకు 98 మంది, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించినందుకు 148 మందిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడికక్కడే జరిమానా చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని రైడర్లు చెప్పడంతో పోలీసులు 794 వాహనాలకు నోటీసులు జారీ చేశారు.

అవగాహన లేమి
చాలా మంది రైడర్లు తమకు నిబంధనలపై అవగాహన లేదని చెప్పడంతో, వారికి గంటకు పైగా ఆయా పరిధుల్లో రూల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు అనుచేత్ తెలిపారు. ఈ-కామర్స్ కు అనుబంధంగా ఉన్న ఎల్లోబోర్డు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని  పోలీసులు ఖండించారు. వాహనం నంబర్ ప్లేట్ రంగుతో సంబంధం లేకుండా ఈ-కామర్స్ డెలివరీ కోసం ఉపయోగించే అన్ని రకాల వాహనాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేసినట్లు అనుచేత్ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)