పాత డిజైన్.. కొత్త లుక్: ఈ బైక్ ధర ఎంతంటే?

Published on Fri, 10/23/2026 - 16:49

చాలామందికి పాతకాలపు బైక్‌ల డిజైన్‌ అంటే ఇష్టం. అయితే అలాంటి బైకుకి లేటెస్ట్ టెక్నాలజీ, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ తోడైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అచ్చం అలాంటి బైక్‌నే తీసుకొచ్చింది డుకాటీ. తన కొత్త మోడల్‌ ఫార్ములా 73ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 1973లో వచ్చిన డుకాటీ 750 సూపర్‌ స్పోర్ట్‌ డెస్మో బైక్‌ స్ఫూర్తితో దీన్ని రూపొందించింది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.20 లక్షలు.

కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 బైక్‌లను మాత్రమే తయారు చేయనుండగా, భారత్‌కు కేటాయించిన అన్ని యూనిట్లు ఇప్పటికే బుక్‌ అయిపోయినట్లు సమాచారం. ఈ బైక్‌ను చూస్తే పాతకాలపు రేసింగ్‌ బైక్‌లు గుర్తుకొస్తాయి. సిల్వర్, ఆక్వా గ్రీన్‌ రంగుల కలయికతో ఫ్యూయల్‌ ట్యాంక్‌పై బంగారు రంగు గీతను ఇచ్చారు. క్లిప్‌-ఆన్‌ హ్యాండిల్‌బార్లు, బార్‌-ఎండ్‌ మిర్రర్లు, చిన్న ఫెయిరింగ్‌, వెనుకవైపు సన్నగా ఉండే సీటు డిజైన్‌ దీనికి కేఫ్‌ రేసర్‌ లుక్‌ను ఇస్తాయి.

ఈ డిజైన్‌ వెనుక డుకాటీ రేసింగ్‌ చరిత్ర ఉంది. 1972లో జరిగిన ఇమోలా రేసులో విజయం సాధించిన 750 ఇమోలా డెస్మో బైక్‌ నుంచి ఈ మోడల్‌కు స్ఫూర్తి లభించింది.

ఇక ఇంజిన్‌ విషయానికి వస్తే.. ఇందులో 803సీసీ డెస్మోడ్యూ ఎల్‌-ట్విన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 73 హెచ్‌పీ పవర్‌, 65.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టెర్మిగ్నోని ఎగ్జాస్ట్‌ను కూడా అందించారు. స్టీల్‌ ట్రెలిస్‌ ఫ్రేమ్‌, ముందు భాగంలో 41 మి.మీ. కైవైబీ అప్‌సైడ్‌-డౌన్‌ ఫోర్క్‌, వెనుక ప్రీలోడ్‌ అడ్జస్టబుల్ మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉన్నాయి.

ఇదీ చదవండి: 343 కిమీ రేంజ్.. కొత్త బైక్ లాంచ్!

పాతకాలపు లుక్‌ ఉన్నప్పటికీ, కొత్త ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కార్నరింగ్‌ ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, క్విక్‌షిఫ్టర్‌, రెండు రైడింగ్‌ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. 4.3 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్‌, ఫుల్లీ ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టం కూడా ఉన్నాయి. అవసరమైతే హీటెడ్‌ గ్రిప్స్‌, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ను అదనపు యాక్సెసరీలుగా పొందవచ్చు. అంటే.. క్లాసిక్‌ డిజైన్‌తో పాటు ప్రస్తుత కాలానికి అవసరమైన టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు.

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)