Breaking News

బాస్ సర్‌ప్రైజ్‌.. ఉద్యోగికి రూ.4 కోట్ల కారు గిఫ్ట్!

Published on Fri, 10/30/2026 - 12:27

ఉద్యోగంలో మంచి పనితీరును కనపరిస్తే.. బాస్ నుంచి ప్రశంసలు లభిస్తాయి, ఇంకా బాగా పనిచేస్తే ప్రమోషన్లు, బోనస్‌లు వస్తాయి. కానీ ఒక ఉద్యోగి తన పనితీరుతో ఏకంగా రూ.కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా అందుకుంటే మాత్రం అది నిజంగా ప్రత్యేకమనే చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దుబాయ్‌కు చెందిన రిచ్‌కీ ప్రాపర్టీస్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దబన్ ఓత్మాన్ తమ ఉద్యోగికి ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న నటాలియా చావెజ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా అందించారు. దీనికి కారణం ఆమె సాధించిన అసాధారణ విజయం. గత రెండేళ్లలో నటాలియా ఏకంగా 500 మిలియన్ డాలర్లకు పైగా విలువైన రియల్ ఎస్టేట్ డీల్స్‌ను పూర్తి చేశారు.

కంపెనీ మూడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఈ గిఫ్ట్‌ అందించారు. ఈ వేడుకలో నటాలియాను 2026 సంవత్సరానికి గాను టాప్ పెర్ఫార్మర్‌గా ప్రకటించారు. దీంతో ఆమె వేదికపైకి వెళ్లి సీఈఓ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇక అవార్డు తీసుకున్న తర్వాత తిరిగి తన సీటుకు వెళ్లబోతుండగా సీఈఓ ఆమెను ఆపారు.

లంబోర్గిని గిఫ్ట్
ఇంకా కార్యక్రమం పూర్తికాలేదని, మరో సర్‌ప్రైజ్ ఉందంటూ.. అందరిలో ఆసక్తి పెంచారు. ఆ తర్వాత కౌంట్‌డౌన్ ప్రారంభించి, రిబ్బన్ కటింగ్ ద్వారా కొత్త నీలిరంగు లంబోర్గిని ఉరుస్ కారును ఆమెకు చూపించారు. అంతే.. ఒక్కసారిగా నటాలియా ఆనందంలో మునిగిపోయారు. కేవలం అవార్డు మాత్రమే వస్తుందని భావించిన ఆమెకు ఇంత ఖరీదైన కారు గిఫ్ట్‌గా రావడంతో ఆశ్చర్యపోయారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

లంబోర్గిని ఉరుస్ కారు ధర విషయానికి వస్తే.. దుబాయ్ మార్కెట్లో దీని ధర సుమారు 9 లక్షల నుంచి 15.5 లక్షల UAE దిర్హామ్‌ల మధ్య ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుంది.

లంబోర్గిని ఉరుస్‌లో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 6000 rpm వద్ద  657 bhp పవర్‌, 2,300 rmp వద్ద 850 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ పొందుతుంది. కేవలం 3.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 306 కిలోమీటర్లు.

Videos

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర..

పెను ముప్పు పొంచి ఉందా? US, UK, జ‌పాన్ జారీ చేసిన రెడ్ అల‌ర్ట్!

అందుకే టీడీపీకి రాజీనామా చేశా... కడప టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జమ్మలమడుగులో హై టెన్షన్ YSRCP నేత కారుపై దాడి

చిలకలూరిపేట ప్రచారంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు!

YSRCP ఏజెంట్ కు ఎన్నికల అధికారి బెదిరింపులు..! ఆడియో వైరల్..

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)