Breaking News

మొబైల్స్‌లో ‘సంచార్‌ సాథీ’ తప్పనిసరి

Published on Tue, 12/02/2025 - 06:24

న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్‌ మొదలైన వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్‌ సాథీ యాప్‌ను కొత్త హ్యాండ్‌సెట్స్‌లో ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయాలంటూ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థలు, దిగుమతిదారులను టెలికం శాఖ (డాట్‌) ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్‌ సాథీ ప్రీ–ఇన్‌స్టాల్‌ చేయాల్సిందేనని నవంబర్‌ 28న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీని ప్రకారం మొబైల్‌ ఫోన్‌లో సంచార్‌ సాథీ యాప్‌ చూడగానే కనిపించేలా, ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్‌ చేయకూడదు. పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు.   

ఇప్పుడున్న ఫోన్లనూ అప్‌డేట్‌ చేయాలి .. 
ఇప్పటికే భారత్‌లో తయారైనవి, విక్రేతల దగ్గర ఉన్నవాటికి సంబంధించి తయారీ సంస్థలు, దిగుమతిదారులు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా యాప్‌ను అందించాల్సి ఉంటుందని డాట్‌ పేర్కొంది. ఈ ఆదేశాల అమలు తీరుతెన్నుల గురించి, ఉత్తర్వులు వెలువడిన 120 రోజుల్లో అన్ని సంస్థలు, దిగుమతిదారులు కాంప్లయెన్స్‌ రిపోర్టును సమరి్పంచాల్సి ఉంటుందని తెలిపింది.

 ప్రస్తుతం యాపిల్, శాంసంగ్, గూగుల్, వివో, ఒప్పో, షావోమీలాంటి దిగ్గజాలు భారత్‌లో హ్యాండ్‌సెట్స్‌ని తయారు చేస్తున్నాయి. ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ నంబర్‌) దురి్వనియోగంపై సందేహాలుంటే ఫిర్యాదు చేసేందుకు, మొబైల్‌ డివైజ్‌లలోని ఐఎంఈఐలు సిసలైనవేనని నిర్ధారించుకునేందుకు సంచార్‌ సాథీ ఉపయోగపడుతుంది. 15 అంకెల ఐఎంఈఐ నంబరు సహా మొబైల్‌ ఫోన్‌ని గుర్తించేందుకు ఉపయోగపడే దేన్నైనా మార్చివేయడాన్ని నాన్‌–బెయిలబుల్‌ నేరంగా పరిగణిస్తారు. ఇందుకు రూ. 50 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్షలాంటివి ఉంటాయి.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)